spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha Ruthprabhu : కొలనులో సమంత.. ఆ లుక్ లో షాకింగ్ ఫొటోలు వైరల్

Samantha Ruthprabhu : కొలనులో సమంత.. ఆ లుక్ లో షాకింగ్ ఫొటోలు వైరల్

Samantha Ruthprabhu : సమంత.. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తమిళనాటి.. నిజంగానే తెలుగు ప్రేక్షకులను మాయ చేస్తూనే ఉంది. అప్పుడేప్పుడో 2010లో ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత.. 14 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. కేవలం కథానాయక పాత్రలోనే కాకుండా సూపర్ డీలక్స్ వంటి సినిమాలో ప్రతినాయక కోణం ఉన్న నటిగా నటించింది. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లోనూ సమంత అందాలు ఆరబోసే దృశ్యాల్లో నటించింది. ఈ సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్ డీకే మరోసారి సమంతను అందాలు ఆరబోసే దృశ్యాల్లో చూపించనున్నారు. ప్రియాంక చోప్రా నటించిన సిటా డెల్ అనే వెబ్ సిరీస్ ను వారు రీమేక్ చేస్తున్నారు.. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రను తెలుగులో సమంత పోషిస్తున్నది. హాలీవుడ్ మాదిరే తెలుగులోనూ తరహా సన్నివేశాలు తెరకెక్కించాలని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

ఇక కొంతకాలంగా మయోసైటీస్ అనే వ్యాధి తో బాధపడుతున్న సమంత.. దాని నివారణ కోసం చికిత్స తీసుకుంటున్నది. ఆ వ్యాధితో బాధపడుతూనే శాకుంతలం, యశోద, ఖుషి వంటి సినిమాల్లో నటించింది.. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె గత ఏడాది భూటాన్ వెళ్లారు. అక్కడ క్రయో థెరపీ లో చికిత్స తీసుకున్నారు. ఇందులో భాగంగా “హాట్ స్టోన్ బాత్” చికిత్స పొందారు. కొంతకాలానికి బజార్ అనే మ్యాగ్జిన్ లో అందాలు ఆరబోసే దృశ్యాల్లో కనిపించారు. అప్పట్లో విడుదలైన ఆమె ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.

ఖుషి సినిమా విడుదలైన తర్వాత తదుపరి ప్రాజెక్టు ఏమిటో సమంత స్పష్టం చేయలేదు. ఖుషి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ తో సమంత సన్నిహితంగా ఉంటుందనే గుసగుసలు వినిపించాయి. సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్, సమంత చేసిన డ్యాన్స్ కూడా పై గుసగుసలకు బలం చేకూర్చింది. తర్వాత ఆమె కొంతకాలం సైలెంట్ గా ఉంది. తనను ఇబ్బంది పెడుతున్న మయోసైటీస్ వ్యాధికి ఆమె మలేషియాలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కొలనులో ఆమె సేదతీరుతున్న ఫోటోలను సామాజిక మాధ్యమ ఖాతాలలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి. సమంత కొలనులో ఈత కొడుతున్న దృశ్యాలు కొర్రకారకు మతి పోగొట్టినంత పని చేస్తున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...

Three Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.. ఇది ఊహించని...

Three Sisters Marry One Man: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం మీడియం మొత్తం తన వైపు తిప్పుకున్నారు. తమ గురించి మాట్లాడుకునే...

Balakrishna: బాలయ్య ఈ ఇద్దరు లేకుండా సినిమా చేయడం లేదుగా…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రీసెంట్ గా ఆయన చేసిన 'అఖండ 2' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన...

YSR Congress: గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం...
Oktelugu Epaper
Exit mobile version