
Samantha – Naga Chaitanya : సమంత-నాగ చైతన్య విడిపోయి దాదాపు రెండేళ్లు అవుతుంది. 2021 అక్టోబర్ నెలలో విడాకుల ప్రకటన చేశారు. అధికారిక ప్రకటనకు కొన్ని నెలల ముందు నుంచే వారు విడివిడిగా జీవించారు. ఈ క్రమంలో సామ్-చైతూ విడిపోతున్నారంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రచారం జరిగినట్లే… వారు గుడ్ బై చెప్పుకున్నారు. మరి విడాకులు అనగానే కారణాల అన్వేషణ మొదలవుతుంది. ఈ క్రమంలో అనేక వాదనలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా సమంత ఆరోపణలు ఎదుర్కొంది.
సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని, నాగ చైతన్యను మోసం చేస్తూ ఎఫైర్స్ పెట్టుకుందని… ఇలా దారుణ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై సమంత సీరియస్ అయ్యారు. నిరాధార కథనాలు ప్రచురించవద్దని మర్యాదగా చెప్పింది. అయినా వినకపోవడంతో కొన్ని ఛానల్స్ మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. సమంత ఎలాంటి చర్యలు తీసుకున్నా వార్తలైతే పూర్తిగా ఆగలేదు. అడపాదడపా రాస్తూనే ఉన్నారు.
అయితే సమంత, నాగ చైతన్యకు మధ్య మనస్పర్థలకు కారణాలు ఇవే, ఆమె స్వయంగా చెప్పారంటూ ఓ ట్వీట్ ప్రకంపనలు రేపుతోంది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు తన ట్వీట్లో… నాగ చైతన్య మాజీ భార్య సమంతను తిడుతూ, కొడుతూ… మానసిక శారీరక వేదనకు గురి చేశాడు. చైతూ కారణంగా సమంత అబార్షన్ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. అతనొక బ్యాడ్ హస్బెండ్. విడాకులు తీసుకుని వదిలించుకున్నందుకు సమంత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అని కామెంట్ చేశాడు.
నాగ చైతన్య తనను టార్చర్ పెట్టాడని… అందుకే ఆమె విడాకులు తీసుకుని అతనికి దూరంగా వెళ్లిపోయిందని సదరు ట్వీట్ సారాంశం. అలాగే ఈ విషయాలు సమంత సన్నిహితులతో చెప్పారట. ఉమర్ సంధు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అయితే ఉమర్ సంధు సెన్సేషనల్ ట్వీట్స్ కి ఫేమస్. నిజం ఉన్నా లేకున్నా అటెన్షన్ రాబట్టడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడతాడనే వాదన ఉంది . సమంత-నాగ చైతన్యలకు పెద్ద గొడవలే జరిగాయన్నది నిజం. అందుకు కారణాలు ఏంటనేది వారికి మాత్రమే తెలిసిన రహస్యం. కాబట్టి ఉమర్ సంధు ట్వీట్లో ఏమాత్రం నిజం ఉండకపోవచ్చు.
BREAKING NEWS : As per #SamanthaRuthPrabhu, #NagaChaitanya abused her badly. He was the Worst Husband ever. I suffered alot mentally & physically torture. I was even Pregnant but i did abortion. Thank god, I divorced & moved on. pic.twitter.com/7ybQYB93PZ
— Umair Sandhu (@UmairSandu) March 12, 2023