https://oktelugu.com/

RRR Postpone: ‘ఆర్ఆర్ఆర్’.. భీమ్లా నాయక్ తోపాటు టాలీవుడ్, బాలీవుడ్ ను ముంచేసిందా?

RRR Postpone: బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఈ చిత్రాన్ని ఖచ్చితంగా చూడాలనిపించేలా చేశాయి. సంక్రాంతి రేసులో నిలబడేందుకు జనవరి 7న రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇక మంచి క్యాష్ చేసుకునే సీజన్ అయిన సంక్రాంతికి నిజానికి భీమ్లా నాయక్ తోపాటు ‘సర్కారివారి పాట’, రాధేశ్యామ్, బంగర్రాజు సహా బాలీవుడ్ లోని గంగూభాయి కతియావాడి, జెర్సీ సహా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2022 / 11:55 AM IST
    Follow us on

    RRR Postpone: బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఈ చిత్రాన్ని ఖచ్చితంగా చూడాలనిపించేలా చేశాయి. సంక్రాంతి రేసులో నిలబడేందుకు జనవరి 7న రిలీజ్ డేట్ ప్రకటించారు.

    RRR-Gangubai-Kathiawadi bheemla sarkar

    ఇక మంచి క్యాష్ చేసుకునే సీజన్ అయిన సంక్రాంతికి నిజానికి భీమ్లా నాయక్ తోపాటు ‘సర్కారివారి పాట’, రాధేశ్యామ్, బంగర్రాజు సహా బాలీవుడ్ లోని గంగూభాయి కతియావాడి, జెర్సీ సహా అగ్రహీరోల సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి.

    అయితే ఆర్ఆర్ఆర్ దెబ్బ గంగూభాయి సహా స్టార్ హీరోల సినిమాలు వెనక్కిపోయాయి. అయితే తెలుగులో మొదట సంక్రాంతి నుంచి తప్పుకోవడానికి భీమ్లా నాయక్ సహా సర్కారివారి పాట చిత్ర నిర్మాతలు ఒప్పుకోలేదు. అయితే రాజమౌళి, ఇతర నిర్మాతలు బుజ్జగించడంతో వారు తమ డేట్స్ మార్చేశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’కు సంక్రాంతి పోటీలేదనుకుంటున్న సమయంలో ‘ఒమిక్రాన్ ’ దాడి మొదలైంది.

    నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ కనుక సంక్రాంతి రేసులో లేకుండా గత దసరాకే ముందుగా ప్రకటించినట్టు రిలీజ్ అయితే సంక్రాంతి రేసులో మహేష్ ‘సర్కార్ వారిపాట’.. చిరంజీవి ‘ఆచార్య’, ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ ‘భీమ్లానాయక్’తోపాటు వెంకటేశ్, వరుణ్ ల ‘ఎఫ్3’, నాగార్జున ‘బంగర్రాజు’, రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు కూడా సంక్రాంతి రిలీజ్ కు ప్రయత్నించేవి. అయితే ఒక్క ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు ఈ మూవీలన్నీ సంక్రాంతి ఆలోచన మరిచి వాయిదాపడ్డాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విడుదల చేయకపోవడంతో ఆ మూవీతోపాటు ఇన్ని మూవీలు కూడా నిండా మునిగినట్టైంది.

    ఇప్పటికే కరోనాతో ఒక సంవత్సరం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన సినీ ఇండస్ట్రీని తాజాగా మరోసారి ‘ఒమిక్రాన్’ రూపంలో చావుదెబ్బ తీసింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో మొత్తం బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. అటు సంక్రాంతికి వారి సినిమాలు విడుదల కాక.. ఇటు ఆర్ఆర్ఆర్ కూడా విడుదల వాయిదా పడడంతో అందరూ నిండా మునిగారు. ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన భీమ్లానాయక్, గంగూబాయిలు సంక్రాంతికి తిరిగి రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. మళ్లీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడు డేట్ ప్రకటిస్తారో? ఎప్పుడు విడుదల చేస్తారో? మళ్లీ ఎవరి సినిమాకు ఎసరు పెడుతారోనన్న టెన్షన్ మిగతా అగ్రహీరోల చిత్రాల నిర్మాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోందట..