Unstoppable Show: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల ‘అఖండ’ సినిమాతో భారీ విజయం సాధించిన బాలయ్య… మరో పక్క హోస్ట్ గా కూడా అదరగొడుతున్నారు. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో ‘అన్ స్టాపబుల్ షోతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. తనదైన శైలిలో బాలయ్య తన యాంకరింగ్ తో అందర్నీ మెప్పిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, నాని, రాజమౌళి, కీరవాణి, సుకుమార్, అల్లుఅర్జున్, రష్మిక, రవితేజ, గోపీచంద్ మలినేని వచ్చారు. తాజాగా రాబోయే ఎనిమిదవ ఎపిసోడ్ గెస్ట్ ఎవరో రివీల్ చేశారు.
Unstoppable Show:
కాగా 8వ ఎపిసోడ్ లో దగ్గుబాటి వారసుడు రానా దగ్గుబాటి తో సందడి చేయనున్నాడు బాలయ్య. ఈ విషయాన్ని ఆహా మేకర్స్ ప్రకటిస్తూ సెట్ లో ఉన్న బాలయ్య, రానా ల ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. యంగ్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన కూడా హోస్ట్ గా వ్యవహరించారు. దీంతో ఇద్దరి హోస్ట్ ల మధ్య జరిగే సంభాషణ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: ఆర్ఆర్ఆర్ వాయిదా: తెగ వైరల్ అవుతున్న మీమ్స్
Handsome hunk and everyone's Yaar @RanaDaggubati lights up #UnstoppableWithNBK with his charm.
Episode 8 Premieres January 7. #NandamuriBalakrishna #MansionHouse @tnldoublehorse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustriesltd #CellPoint pic.twitter.com/61TWJKabX9
— ahavideoin (@ahavideoIN) January 1, 2022
ఇక మహేష్ బాబు ఎపిసోడ్ తో సీజన్ ముగిస్తున్నాము అని ఆహ వారు ప్రకటించిన విషయం తెలిసిందే. మహేష్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రానుంది. ఇక ఈమధ్యలో మరో స్టార్ హీరో తో బాలయ్య రచ్చ చేయనున్నాడు. కాగా రానా ఎపిసోడ్ వచ్చే శుక్రవారం స్ట్రీమింగ్ కానుంది. గతంలో వీరిద్దరు కలిసి ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో నటించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: హీరో సాయిధరమ్‌తేజ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరామర్శలో..ఆంతర్యం అదేనా?