Renu Desai emotional statement : సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో ఒకరు రేణు దేశాయ్(Renu Desai). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాజీ భార్య కి ఈమెకు నేషనల్ వైడ్ గా మంచి పాపులారిటీ ఉంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఈమెని అనుసరించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే సోషల్ మీడియా లో జరిగే నెగెటివిటీ ని సినీ సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోరు. కానీ రేణు దేశాయ్ మాత్రం ప్రతీ చిన్న నెగెటివ్ కామెంట్ ని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటుంది. అంతే కాదు , అప్పుడప్పుడు ఈమె ఇచ్చే ఇంటర్వ్యూస్ సోషల్ మీడియా లో వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయం లో ఈమె పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ ప్రత్యర్థులు ఉపయోగించుకుంటూ ఉంటారు.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన పిల్లల గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నా పిల్లల్ని తన కుటుంబం(పవన్ కళ్యాణ్ మరియు మెగా ఫ్యామిలీ) వద్దకు పంపేటప్పుడు నేను ఒకటే కండీషన్ పెడతాను. మీరు వాళ్ళతో ప్రవర్తించే తీరు , నా పెంపకాన్ని చూపిస్తుంది. అదే విధంగా సమాజం లో మీరు తోటి మనుషులతో మాట్లాడే తీరు కూడా నా పెంపకాన్ని రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇది మీ మనస్సులో పెట్టుకొని నడుచుకోండి’ అని చెప్పానంటూ ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనిపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అకిరా నందన్, ఆద్య లకు సంబంధించిన బాగోగులు రేణు దేశాయ్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా సమానంగా చూస్తున్నాడని , కానీ ఇక్కడ రేణు దేశాయ్ తాను మాత్రమే వాళ్ళని పెంచుతున్నట్టు చెప్తోంది అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
మరోపక్క అకిరా నందన్ మొదటి సినిమా కోసం అభిమానులు , ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మాత్రం రేణు దేశాయ్ ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. మీ అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను , అకిరా నందన్ కి రావాలనిపిస్తే వస్తాడు అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. కానీ సీక్రెట్ గా అకిరా నందన్ కోసం కథలు వెతుకుతున్నారు పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్. మొదటి సినిమాను స్వయంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడు. డైరెక్టర్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ ఏడాది లోనే అకిరా మొదటి సినిమాకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన రాబోతుంది.
