https://oktelugu.com/

Rathika Rose : ఎంత మంది తిట్టినా రతికా రోజ్ కి గోల్డెన్ ఛాన్స్… ఆ స్టార్ డైరెక్టర్ నుండి హీరోయిన్ గా బిగ్ ఆఫర్

సోషల్ మీడియాలో దారుణమైన నెగిటివిటీ ఎదుర్కుంటున్న రతికా రోజ్ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కింది. అది కూడా లీడింగ్ రోల్. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించే నెక్స్ట్ మూవీలో రతికా రోజ్ హీరోయిన్ అట.

Written By: , Updated On : October 16, 2023 / 11:41 AM IST
Follow us on

Rathika Rose : సీజన్ కి ఓ కంటెస్టెంట్ అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంటారు. సీజన్ 7కి రతికా రోజ్ అని చెప్పొచ్చు. గేమ్ పేరిట రతికా రోజ్ ప్రవర్తన ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. ఆమె కన్నింగ్ గేమ్ పై ప్రేక్షకులు పెదవి విరిచారు. పల్లవి ప్రశాంత్ తో ఆమె ప్రవర్తించిన తీరు కూడా విమర్శలకు దారి తీసింది. నిజాయితీ లేకపోతే ప్రేక్షకులు ఆదరించని తేలిపోయింది. నాలుగో వారం రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యింది. ఫైనల్ బెర్త్ ఖాయం అనుకున్న రతికాకు షాక్ ఇచ్చారు.

సోషల్ మీడియాలో దారుణమైన నెగిటివిటీ ఎదుర్కుంటున్న రతికా రోజ్ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కింది. అది కూడా లీడింగ్ రోల్. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించే నెక్స్ట్ మూవీలో రతికా రోజ్ హీరోయిన్ అట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన ఆనందం ప్రేక్షకులతో పంచుకుంది. దీంతో ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

చూస్తుంటే రతికా రోజ్ కి గుడ్ టైం స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది. రాఘవేంద్రరావు చాలా కాలం అనంతరం తెరకెక్కిస్తున్న ఈ చిత్ర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో రతికా రోజ్ ఆనందంలో మునిగి తెలుస్తుంది. రతికా రోజ్ హౌస్లో రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. దామిని, శుభశ్రీ, రతికా రోజ్ లకు బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. వీరిలో ఒకరికి హౌస్లోకి వెళ్లే అవకాశం ఇచ్చాడు. ఎవరు హౌస్లోకి వెళ్ళేది నిర్ణయించే అధికారం కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు.

హౌస్ మేట్స్ వీరికి ఓట్లు వేయాల్సి ఉంటుంది. అందుకు ముగ్గురు క్యాంపైన్ కూడా చేశారు. తమకు ఓట్లు వేయాలని కోరుకున్నారు. బిగ్ బాస్ ఓటింగ్ నిర్వహించాడు. బ్యాలెట్ బాక్స్ లో హౌస్ మేట్స్ తమకు నచ్చిన వారికి ఓట్ వేశారు. అయితే ఉల్టా పల్టా అంటూ నాగార్జున తక్కువ ఓట్లు వచ్చిన ఒకరికి ఛాన్స్ అన్నాడు. అంటే హౌస్ మేట్స్ వద్దనుకుంటున్న వ్యక్తి హౌస్లోకి వెళతారు. వచ్చే వారం ఓటింగ్ ఫలితాలు విడుదల చేస్తారు.