Ram Charan And Mahendra Singh Dhoni: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) కి మొదటి నుండి బాలీవుడ్ లో మంచి పాపులారిటీ మరియు క్రేజ్ ఉన్న ఉంది. మగధీర సమయం లోనే ఆయన నార్త్ ఇండియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ క్రేజ్ వల్లే ఆయన బాలీవుడ్ లోకి ‘జంజీర్’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ, ఆరోజుల్లోనే దాదాపుగా 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను హిందీ వెర్షన్ నుండి రాబట్టింది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ ఎక్కువగా టాలీవుడ్ సినిమాల పైనే ఫోకస్ పెడుతూ బాలీవుడ్ ని పూర్తి గా వదిలేసాడు. అయితే #RRR చిత్రం తో మరోసారి నార్త్ ఇండియా లో పాతుకుపోయిన రామ్ చరణ్, ఇప్పుడు ‘చికిరి..చికిరి’ పాటతో మరోసారి నార్త్ ఇండియన్స్ ని ఉర్రూతలూ ఊగించాడు. ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్ లో రామ్ చరణ్ కి సల్మాన్ ఖాన్(Salman Khan) మంచి స్నేహితుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే.
సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ ని తన సొంత తమ్ముడి లాగా చూసుకుంటాడు. తన జీవితం లో జరిగే ప్రతీ ముఖ్యమైన సంఘటనలో రామ్ చరణ్ కచ్చితంగా ఉంటాడు. రీసెంట్ గానే సల్మాన్ ఖాన్ తన 60 వ పుట్టిన రోజు ఘనంగా జరుపుకున్నాడు. ఈ వేడుకలకు తనతో అత్యంత సన్నిహితంగా ఉండే ప్రతీ ఒక్కరిని ఆహ్వానించాడు. వారిలో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, బాబీ డియోల్ మరియు ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni) కలిసి చిట్ చాట్ చేసుకుంటున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. తమ అభిమాన సెలబ్రిటీలను ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు.
ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని తో ఉండడం ఎంతో స్పెషల్ గా భావిస్తున్నారు. రామ్ చరణ్, ధోని కలవడం ఇది కొత్తేమి కాదు . గతం లో వీళ్లిద్దరు కలిసి పెప్సీ యాడ్ లో నటించారు. ఆ తర్వాత #RRR మూవీ విడుదలైన కొత్తల్లో రామ్ చరణ్ , ధోని ఒకసారి భేటీ అయ్యారు. ఇప్పుడు ఇది మూడవ సారి. వీళ్ళ కాంబినేషన్ ని చూసినప్పుడల్లా అభిమానులు ఎంతో ఉత్సాహానికి గురి అవుతున్నారు. త్వరలోనే IPL మొదలు అవ్వబోతుండడం తో రామ్ చరణ్, ధోని మ్యూచువల్ ఫ్యాన్స్ కి ఈరోజు విడుదలైన ఫోటో కచ్చితంగా స్పెషల్ అనే చెప్పాలి . ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చ్ 27న విడుదల చేయబోతున్నారు.
A LEGENDARY PICTURE
– MS Dhoni, Ram Charan, Salman Khan & Bobby Deol during the birthday party. pic.twitter.com/9vj3z6CYAC
— Johns. (@CricCrazyJohns) December 28, 2025