Ram Charan PR Team: ఇటీవల పెద్ద సినిమా అత్యంత గ్రాండ్ గా విడుదలైంది. పాజిటివ్ టాక్ కూడా సొంతం చేసుకుంది. ఆ సినిమా వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ సినిమా రేంజ్ లో మాత్రం కాదు. దీనంతటికీ ప్రధాన కారణం ఆ సినిమా పీఆర్ బృందం నిర్లక్ష్యం. సరిగ్గా ప్రచారం చేయలేకపోవడం.. సినిమా విడుదల రోజు హడావిడి చేసి.. ఆ తర్వాత చేతులెత్తేయడంతో పెద్ది అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది.
పెద్ది సినిమా పీఆర్ టీమ్ నిర్లక్ష్యం అలా ఉంటే.. రామ్ చరణ్ ప్రజా సంబంధాలను (పబ్లి రిలేషన్) చూసే బృందం కూడా అలానే తగలబడింది. తాజాగా రామ్ చరణ్ రిపబ్లిక్ టీవీ నిర్వహిస్తున్న కాంక్లేవ్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. దీనికి దేశ విదేశాలకు సంబంధించిన సెలబ్రిటీలు హాజరవుతూ ఉంటారు. అనేక అంశాల మీద తమ అభిరాన్ని చెబుతుంటారు.
ప్రస్తుత కాంక్లేవ్ కు రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ అనేక అంశాల గురించి ఆయన మాట్లాడారు. ప్రముఖంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని షేక్ చేసిన దురంధర్ సినిమా గురించి రాంచరణ్ మాట్లాడాడు. అయితే ఇక్కడే రామ్ చరణ్ పిఆర్ టీం చేసిన తప్పు ఆయనను మరోసారి పలచన చేసింది.
దురంధర్ సినిమా గురించి చెప్పుకుంటూ పోయిన రామ్ చరణ్.. ఒక విషయంలో నోరు జారారు. అది కాస్త ఆయన పిఆర్ టీం లేకితనాన్ని బయటపెట్టింది. దురంధర్ సినిమా మార్చి 19 విడుదలైంది. ఆ మరుసటి రోజు ఈ సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడారు.. ట్విట్టర్ ఎక్స్ లో అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని చెప్పారు. నటులు బ్రహ్మాండంగా నటించారని వివరించారు.
తాజాగా కాంక్లేవ్ లో రామ్ చరణ్ తాను దురంధర్ సినిమాను ఓటీటీలో చూశాను అని చెప్పారు. ఆయన మాట్లాడిన ఆ మాటలు సంచలనంగా మారాయి. సరిగ్గా మార్చి 20న తాను థియేటర్లో దురంధర్ సినిమా చూశానని చెప్పిన రామ్ చరణ్.. ఇప్పుడు మళ్లీ ఓటిటిలో చూసినట్టు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే అప్పుడు రామ్ చరణ్ సినిమా చూడలేదా.. పి.ఆర్ బృందం రాసిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా ట్వీట్ చేశారా అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నాడు రామ్ చరణ్ పాత ట్రీట్.. రిపబ్లిక్ టీవీలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను జతచేస్తూ మీమ్స్ సృష్టిస్తున్నారు. సెటైర్లు వేస్తూ విమర్శలు చేస్తున్నారు. రామ్ చరణ్ పిఆర్ టీం ఇంత వీకా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో రామ్ చరణ్ ఇటీవల ఖాళీగా ఉన్నాడేమో.. అందువల్లే మళ్ళీ సినిమా చూసి ఉంటాడని పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రామ్ చరణ్ పిఆర్ టీం మరోసారి నవ్వుల పాలైంది. ఇటువంటి తప్పులు జరగకుండా మరోసారి ఆ బృందం చూసుకుంటుందా.. లేకుంటే ట్రోలర్లకు పని చెబుతుందా.. చూడాల్సి ఉంది.
