Rajamouli: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అంత ఆషామాషీగా రాదు. దానికోసం విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన కష్టం కూడా వృధా అయిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి సినిమా ప్రేక్షకుడికి నచ్చే విధంగా తెరకెక్కించడం ఒకటైతే దానిని పర్ఫెక్ట్ గా రిలీజ్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందడం మరొకెత్తనే చెప్పాలి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్లలో రాజమౌళి ఒకరు…ఇక రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ ఇండియాలోనే టాప్ రైటర్ గా కొనసాగుతున్నాడు. రాజమౌళి చేసే ప్రతి సినిమాకి కథ అందిస్తున్నాడు.రాజమౌళికి ఇండస్ట్రీలో కీరవాణి, కాంచీ అనే బ్రదర్స్ ఉన్నారు. అయితే తనకు సొంతం బ్రదర్స్ అనేవారు ఎవరు లేరని చాలామంది అనుకుంటారు. కానీ కీరవాణి వాళ్ల చిన్న తమ్ముడు అయిన కళ్యాణ్ కోడూరుని సైతం విజయేంద్ర ప్రసాద్ తన కొడుకుగా పెంచాడట. కాబట్టి రాజమౌళి ఒక్కడు కాదు తనకు కళ్యాణ్ కోడూరు రూపం లో ఒక ఓన్ బ్రదర్ ఉన్నాడని చెప్తారు. ఇక ఏది ఏమైనా కూడా చిన్నతనంలో రాజమౌళి ఒంటరిగా ఉండకూడని భావించిన విజయేంద్ర ప్రసాద్ కళ్యాణ్ కోడూరు ని సైతం తన కన్న కొడుకుగా భావించి తన ఇంట్లోనే ఉంచుకునే వాడట.
నిజానికి వీళ్లంతా జాయింట్ ఫ్యామిలీ అయినప్పటికి విజేంద్రప్రసాద్ కళ్యాణ్ కోడూరు ని చాలా సపరేట్గా చూసేవాడట. ఇక రాజమౌళి సైతం చిన్నతనంలో తను రాసుకున్న కొన్ని కథలను కళ్యాణ్ కోడూరి కి మొదటగా వినిపించేవాడట. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతుండటం విశేషం…
ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన సినిమాల్లో ఆంధ్రుడు, ఊహలు గుసగుసలాడే లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా కళ్యాణ్ కోడూరి సైతం ఇండస్ట్రీలో తన మార్కును చూపించాడు.
ఈయన మ్యూజిక్ లో వచ్చే పాటలు మెలోడియస్ గా ఉండడమే కాకుండా చాలామంది ప్రేక్షకులను అలరించాయి… ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి తో పాటు తన ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…