Rajamouli – Mahesh : తను తీసిన సినిమాల ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఎవరు అంటే రాజమౌళి అనే చెప్పాలి. ఇక ఆయన తీసిన సినిమాలు అన్ని భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సాధించడంతో పాటుగా ఆయనకు పాన్ ఇండియా లెవెల్లో భారీ గుర్తింపు తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు ఇక అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈ స్క్రిప్ట్ ని లాక్ చేసిన రాజమౌళి ఇప్పుడు ఆర్టిస్టులను ఎంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు.
ఇక అందులో భాగం గానే తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు స్టార్ నటులను ఈ సినిమాలోకి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళు ఎవరు అంటే ఒకరు విక్రమ్ కాగా, మరొకరు విలక్షణ నటుడు గా గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి అని తెలుస్తుంది. ఇందులో ఒకరు విలన్ పాత్ర పోషించగా, మరొకరు మాత్రం మహేష్ బాబుకి మెంటర్ గా ఉండే క్యారెక్టర్ లో చేయబోతున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి గైడెన్స్ ఇచ్చే ఒక మెంటర్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన డిసిజన్ కి అనుగుణంగానే మహేష్ బాబు ఈ సినిమాలో ముందుకు నడవబోతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇంతవరకు అయితే క్లారిటీ అయితే లేదు. తొందరలోనే ఈ సినిమా కి సంబంధించిన పూర్తి అప్డేట్ ని ఇవ్వడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి, విక్రమ్ లాంటి ఇద్దరు స్టార్ నటులు నటించడం తో ఈ సినిమా రేంజ్ అనేది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది…
మరి ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందో లేదో తెలియదు గానీ ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ మాత్రం భారీ లెవల్లో ఉన్నట్టు గా తెలుస్తుంది. బడ్జెట్ అంతలా పెట్టడం పైననే విమర్శకులు సైతం రాజమౌళి మీద కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు అయితే రాజమౌళి సినిమా కాబట్టి ఎన్ని కోట్లు పెట్టిన మళ్లీ ఆ డబ్బులనేవి తిరిగి వస్తాయి అని మరికొంత మంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…