Tollywood Movies: రాధేశ్యామ్, సర్కార్ వారి పాట, ఆచార్యలో ఏది అత్యధిక కలెక్షన్లు రాబడుతుంది?

Tollywood Movies: టాలీవుడ్ కు ‘భీమ్లానాయక్’ ఓ ఊపు వచ్చింది. ఆ ఊపును కంటిన్యూ చేయడానికి ఇప్పుడు వరుసగా సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. కరోనా కల్లోలం పోయి థియేటర్లలో ఆక్యూపెన్సీ ఆంక్షలు పోయిన నేపథ్యంలో వరుసగా సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇక భారీ బడ్జెట్ అయిన ఆర్ఆర్ఆర్ ను వదిలేస్తే.. ఇక సర్కారి వారి పాటను ఏప్రిల్ లో రిలీజ్ […]

Written By: NARESH, Updated On : March 1, 2022 7:43 pm
Follow us on

Tollywood Movies: టాలీవుడ్ కు ‘భీమ్లానాయక్’ ఓ ఊపు వచ్చింది. ఆ ఊపును కంటిన్యూ చేయడానికి ఇప్పుడు వరుసగా సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. కరోనా కల్లోలం పోయి థియేటర్లలో ఆక్యూపెన్సీ ఆంక్షలు పోయిన నేపథ్యంలో వరుసగా సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇక భారీ బడ్జెట్ అయిన ఆర్ఆర్ఆర్ ను వదిలేస్తే.. ఇక సర్కారి వారి పాటను ఏప్రిల్ లో రిలీజ్ కు ఫిక్స్ చేశారు. చిరంజీవి ‘ఆచార్య’ను కూడా ఈ రెండింటి మధ్యలో విడుదల చేస్తున్నారు.

ఇక ప్రభాస్ రాధేశ్యామ్ ప్యాన్ ఇండియా చిత్రం కావడంతో మార్చి, ఏప్రిల్ లోనే సినిమా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే రాధేశ్యామ్, సర్కారి వారి పాట, ఆచార్య సినిమాలో దేనికి అత్యధిక కలెక్షన్లు రాబడుతుందనే దానిపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ ను వదిలేస్తే.. మిగతా సినిమాల్లో ‘రాధేశ్యామ్’ పై కూడా భారీ అంచనాలున్నాయి. ఇదీ ప్యాన్ ఇండియా మూవీ కావడంతో సినిమా బాగుంటే కలెక్షన్ల వర్షం కురువనుంది.

ఇక టాలీవుడ్ లోనే రిలీజ్ అయ్యే ‘ఆచార్య’, సర్కారివారి పాట సినిమాలు కూడా మంచి కంటెంట్ తో వస్తున్నాయి.కొరటాల శివ, పరుశురాం దర్శకత్వం వహిస్తుండడంతో వీటిపై కూడా అంచనాలు పెరిగాయి. ఇవి కూడా హిట్ అయితే అత్యధిక కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

మొత్తంగా ఈ మూడు సినిమాలు వేటికవే ప్రత్యేకం.. కథ, కథనాలు పూర్తి డిఫెరెంట్. ఏ చిత్రం అత్యధిక కలెక్షన్లు రాబడుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. ‘రాధేశ్యామ్ ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అదే అత్యధిక కలెక్షన్లు రాబట్టువచ్చు.  కథా కథనం చూస్తే మంత్రి ‘సర్కారివారి పాట’, ఆచార్య, ‘రాధేశ్యామ్’ బలంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఏది అత్యధిక కలెక్షన్లు రాబడుతుందనే దానిపై కామెంట్ రూపంలో తెలియజేయండి.