Radhe Shyam Movie: హీరోలు ఎవరికీ వాళ్ళు తాము పాన్ ఇండియా స్టార్ అంటూ గొప్పలు పోతున్నా.. నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఉన్న ఏకైక ఇండియన్ హీరో ప్రస్తుతానికి ప్రభాస్ ఒక్కడే. మరి అలాంటి స్టార్ నుంచి వస్తున్న సినిమా ‘రాధేశ్యామ్’. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
-‘రాధేశ్యామ్’ ఎప్పుడు మొదలైంది..?
‘రాధే శ్యామ్’ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు అభిమానులు. ఎప్పుడో 2018 అక్టోబర్ లో మొదలైంది ఈ సినిమా. ఎంత పెద్ద సినిమా అయినా మహా అయితే ఓ ఏడాదిలో పూర్తయిపోతుంది. కానీ ఈ సినిమా పూర్తవ్వడానికి నాలుగో ఏడాది కూడా రావాల్సి వచ్చింది. ‘రాధే శ్యామ్’ ఆలస్యానికి తొలుత కథలో లోపం, షూటింగ్ కి ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి స్క్రిప్ట్ లో ఏవేవో మార్పులు చేశారు. ఆ తర్వాత కరోనా కారణంగా మరింత ఆలస్యం అయింది.
ఎట్టకేలకు ఈ సినిమాను 2021 నవంబర్ లో పూర్తి చేశారు. మధ్యలో విడుదల పలు తేదీలు అధికారికంగా ప్రకటించడం, తీరా విడుదల చేద్దాం అనేసరికి రీషూట్లు ప్రారంభించడం ‘రాధేశ్యామ్’కి అలవాటు అయిపోయింది. ముఖ్యంగా కీలక సన్నివేశాల విషయంలో టీమ్ అసంతృప్తి వ్యక్తం చేసి రామోజీ ఫిల్మ్ సిటీలో విదేశాల సెట్స్ వేసి రీషూట్ చేశారు.
-‘రాధేశ్యామ్’ కథ ఇదే !
ఈ సినిమా కథ.. ఓ రియల్ స్టోరీ అని టాక్ నడుస్తోంది. సినిమా ఓపెనింగ్ లోనే.. ఓ ట్రైన్ 106 మంది ప్యాసింజర్లతో రోమ్ కి బయలుదేరుతుంది. అయితే, అ ట్రైన్ ఓ టన్నేలోకి వెళ్లి తిరిగి బయటకు రాదు. అసలు ఆ ట్రైన్ ఏమైపోయింది ? అందులోని ప్యాసింజర్లు ఏమయ్యారు ? అనే మిస్టరీతో సినిమాలో టెన్షన్ మొదలవుతుంది.
నిజానికి ఇది రియల్ స్టోరీ. అది 1911 వ సంవత్సరం. ఇటలీలో 106 మంది ప్యాసింజర్లతో జనట్టి అనే ఒక ట్రైన్ రోమ్ కి వెళ్తూ.. మార్గ మధ్యంలో లాంబార్టీ మౌంటెన్ వద్ద ఒక పెద్ద టన్నెల్ లోకి వెళ్ళింది. ఐతే, ఇప్పటి వరకూ ఆ ట్రైన్ బయటికి రాలేదు. అసలు ఆ ట్రైన్ ఏమైపోయిందో అని నేటికీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ మిస్టరీలోని ట్విస్ట్ ఛేదిస్తూ రాధేశ్యామ్ సినిమా ముగుస్తోంది.
-‘రాధే శ్యామ్’ బడ్జెట్ ఎంత?
దాదాపు రూ.350 కోట్లకు పైగానే బడ్జెట్ తో రూపొందింది ఈ సినిమా. ఈ మూవీ క్లైమాక్స్ 15 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగుతుంది. అందుకే ఒక్క క్లైమాక్స్ కోసమే రూ. 50 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇక రెమ్యునరేషన్స్ విషయానికి వస్తే.. ప్రభాస్ కి ఇంత రెమ్యునరేషన్ అని ప్రత్యేకంగా లెక్కలు ఏమి లేవు. కానీ, సినిమాకి అయిన బడ్జెట్, అలాగే సినిమాకి జరిగిన బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుంటే.. ప్రభాస్ కి 90 కోట్లు వరకూ రెమ్యునరేషన్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. టాల్ బ్యూటీ పూజా హెగ్డేకి 4 కోట్లు రెమ్యునరేషన్ ను ఇచ్చారు.
-‘రాధే శ్యామ్’ చేసిన సాయం :
హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి నేతృత్వంలో రూ.1.6కోట్లుతో రైల్వేస్టేషన్ సెట్ మరియు ఓ హాస్పిటల్ సెట్ కూడా వేశారు, ఈ హాస్పిటల్ సెట్‌ను షూటింగ్ పూర్తయ్యాక అందులోని బెడ్స్, స్ట్రక్చర్స్, సలైన్ స్టాండ్స్ తదితర వస్తువులన్నింటిని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు కరోనా బాధితుల సహాయార్ధం ఇచ్చారు.
-‘రాధేశ్యామ్’ ప్రత్యేకత :
‘రాధేశ్యామ్’ వీఎఫ్ఎక్స్ వర్క్ 12 దేశాల్లో చేశారు. మరో ఏ ఇండియన్ సినిమాకి ఈ రేంజ్ లో వీఎఫ్ఎక్స్ వర్క్ చేయలేదు. పైగా విజువల్స్ హాలీవుడ్ సినిమా రేంజ్ కి మించి ఉంటాయట. అందుకే ఇది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని.. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని టీమ్ నమ్మకంగా ఉంది.
Also Read: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్ అయ్యారా?
-‘రాధేశ్యామ్’ కోసం రెబల్ స్టార్ కృష్ణంరాజు ‘ఏడాది గడ్డం’ !
‘రాధేశ్యామ్’లో పరమహంస పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. నటించడం అంటే.. ఎదో అలా వచ్చి ఇలా నటించలేదు. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర కోసం కృష్ణంరాజు ఏడాదిగా గడ్డం పెంచారు. పైగా ప్రభాస్ తో కృష్ణంరాజు కలిసి నటిస్తోన్న మూడో సినిమా ఇది.
-‘రాధే శ్యామ్’ లో తారాగణం
ప్రభాస్ – విక్రమాదిత్య
పూజా హెగ్డే – ప్రేరణ
కృష్ణం రాజు – పరమహంస
జగపతిబాబు
సత్యరాజ్
సచిన్ ఖేదేకర్
ప్రియదర్శి
భాగ్యశ్రీ
మురళి శర్మ,
కునాల్ రాయ్ కపూర్
సత్యాన్
శాషా ఛత్రి
రిద్దికుమార్ మరియు తదితరులు వివిధ పాత్రల్లో నటిస్తున్నారు.
– సినిమాకు పనిచేసిన నిపుణులు వీరే..
దర్శకత్వం : కె.రాధాకృష్ణ,
కథా రచయిత : కె.రాధాకృష్ణ కుమార్,
నిర్మాత : భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదా.
ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస.
కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు.
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్.
-పాటలు:
మిథున్, మనన్ భరద్వాజ్
నిర్మాణ సంస్థలు :
యూవీ క్రియేషన్స్
టీ-సిరీస్
-పంపిణీదారులు
ఏ ఏ ఫిలిమ్స్ (హిందీ)
కాగా రాధేశ్యామ్ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా వంశీ – ప్రమోద్ – ప్రసీద – భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read: మోహన్ బాబుకు రాజభవనాన్ని తలపించే ఇల్లు.. మంచు లక్ష్మీ వీడియో వైరల్!
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Radhe shyam movie full story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com