Prakash Raj Controversy: రామలక్ష్మణులపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్(Actor Prakash Raj) ఇటీవల కేరళ లో జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రకాష్ రాజ్ పై దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. రాముడు, లక్ష్మణుడు నార్త్ ఇండియా నుండి సౌత్ ఇండియా కి వలస వచ్చి , ఒక వనం లో ఆగాడు. అక్కడ వాళ్ళు ఆకలికి ఆగలేక పండ్లని దొంగతనం చేసి తిన్నారు , ఆ వనం మరెవరిదో కాదు, రావణుడిది, అప్పుడు రావణుడి చెల్లి సూర్పనక్క డబ్బులు కట్టమని అడగడం తో అది యుద్దానికి దారి తీసింది అంటూ , వెటకారంగా , అత్యంత నీచంగా మాట్లాడి అబాసుపాలయ్యాడు. 48 గంటలోపు ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పకపోతే ఆయన 100 కోట్ల రూపాయిల పరువు నష్టం దావా కట్టాలంటూ కేసులు వేశారు.
అయితే నిన్న నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ పై కౌంటర్ వేస్తూ ‘నువ్వు నాస్తికుడివి అయ్యుండొచ్చు , కానీ కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే హక్కు నీకు లేదు’ అంటూ ప్రకాష్ రాజ్ ని ట్యాగ్ చేసి చాలా పెద్ద ట్వీట్ వేశాడు. అయితే ప్రకాష్ రాజ్ నేడు ఈ వివాదం పై స్పందించాడు. అందరూ ఆయన హిందువులకు క్షమాపణలు చెప్తాడని అనుకున్నారు. కానీ ఆయన అప్లోడ్ చేసిన వీడియో ని చూసి ఇతను ఈ జన్మకు మారడు అని ఫిక్స్ అయిపోయారు. ఆయన మాట్లాడుతూ ‘నేను రీసెంట్ గా ఒక ఈవెంట్ లో మాట్లాడిన మాటల్లో కొన్నిటిని మాత్రమే తీసుకొని , నేనేదో అవతార పురుషుడు శ్రీ రాముడిని వెటకారం చేసానని , హిందూ ధర్మాన్ని పాటించే కోట్లాది మంది మనసులు నొచ్చుకునేలా చేశానని, ఏదేదో మాట్లాడుతున్నారు . అన్ని ధర్మాలను , అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు’.
‘కానీ , ధర్మాన్ని మతోన్మాదాన్ని అడ్డం పెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక, కొందరు నన్ను హిందూ ధర్మ విరోధిని అని ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థం అవుతోంది. కాబట్టి వాళ్లకి సమాధాన చెప్పాలి. ప్రస్తుతం నేను తోట పనుల్లో ఉన్నాను , ఎండా కాలం ముగుస్తుంది , వర్షా కాలం మొదలు కాబోతుంది, ఆ పనుల్లో ఉన్నాను, త్వరలో వస్తాను , అప్పటి దాకా మీరు మీ పనులు చూసుకుంటారో, లేదా ఇలా వాగుతుంటారో మీ ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
To all the desperate bigots #justasking pic.twitter.com/zGLpbEOcYp
— Prakash Raj (@prakashraaj) April 19, 2026