Prabhas And Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన కథతో మరొక హీరో సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి డిజాస్టర్ ని మూటగట్టుకొని తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయిన సందర్భాలు సైతం ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇప్పుడున్న కొత్త హీరోల వరకు ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక జడ్జిమెంట్ లోపంతో బాధపడ్డ వారే కావడం విశేషం… సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలను చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్న క్రమంలో కృష్ణవంశీతో ‘మురారి’ అనే సినిమా చేశాడు.
ఇక ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ మహేష్ బాబుతో మరో సినిమా చేయాలనుకున్నాడు… అందులో భాగంగానే ‘చక్రం’ సినిమా కథని ముందుగా మహేష్ బాబు వినిపించారట. కానీ మహేష్ బాబు మాత్రం ఆ కథని రిజెక్ట్ చేయడంతో కృష్ణ వంశీ అది వేరే ఇంకెవరైనా చిన్న హీరోతో చేద్దామని అనుకున్నారట.
కానీ ప్రభాస్ అనుకోకుండా ఆ కథను విని మనం ఈ సినిమా చేద్దామని పట్టుబట్టి మరీ కృష్ణవంశీ డైరెక్షన్ లో చక్రం అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ప్రభాస్ లోని పూర్తిస్థాయి నటుడిని బయటికి తీసిందనే చెప్పాలి. కృష్ణవంశీ సినిమాలో నటించిన హీరోలు ఆయన సినిమాలో నటించక ముందు, నటించిన తర్వాత అనేలా వేరియేషన్స్ అయితే కనిపిస్తాయి…
ఆయన సినిమాలో చేసిన ఆర్టిస్ట్ యొక్క నటనలో పరిణితి కనిపిస్తుంది… మొత్తానికైతే ప్రభాస్ తన కెరియర్ స్టార్టింగ్ లోనే కృష్ణవంశీ డైరెక్షన్లో సినిమా చేసి ఒక డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన చత్రపతి సినిమాతో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు… ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు…