Varun Tej: మేర్లపాక గాంధీ దర్శకత్వం లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా నటించిన ‘కొరియన్ కనకరాజు’. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నటువంటి వరుణ్ తేజ్ కి ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా ముఖ్యం. మెగా ఫ్యామిలీ నుండి మరో స్టార్ హీరో రాబోతున్నారు అనే హైప్ తో వరుణ్ తేజ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. మొదట్లో పెద్దగా విజయాలు రాలేదు కానీ , ఆ తర్వాత ఫిదా , తొలిప్రేమ, గడ్డలకొండ గణేష్, ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలవడం తో హీరో గా ఇండస్ట్రీ లో స్థిరపడ్డారు వరుణ్ తేజ్. కానీ కరోనా లాక్ డౌన్ తర్వాత ఆయన నుండి విడుదలైన గని, మట్కా వంటి చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ అవ్వడమే కాకుండా, వరుణ్ తేజ్ మార్కెట్ ని బాగా దెబ్బతీశాయి.
అందుకే ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలనే కసితో ఆయన ఈ ‘కొరియన్ కనకరాజు’ అనే చిత్రాన్ని చేశారు. చిత్తూరు కి సంబంధించిన ఒక వ్యక్తి కొరియా కి వెళ్లి అక్కడ మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ఇప్పటికే విడుదలై ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఎప్పటిలాగానే వరుణ్ తేజ్ ఈసారి కూడా డిఫరెంట్ గానే ప్రయత్నం చేశారు కానీ, ఈసారి గట్టిగ వర్కౌట్ అయ్యేలా ఉంది అని అంతా అనుకున్నారు. నేడు ఈ చిత్రానికి టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే కాసేపటి క్రితమే మేకర్స్ ఫ్యాన్స్ , ఆడియన్స్ కి మరో స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ టీజర్ ని రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు.
ప్రభాస్ కి వరుణ్ తేజ్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది అనే సంగతి అందరికీ తెలిసిందే. గతం లో వరుణ్ తేజ్ హీరో గా నటించిన ‘లోఫర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. అయితే ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ప్రభాస్ మరోసారి వరుణ్ తేజ్ కోసం రంగం లోకి దిగారు. మరి ఈసారైనా ప్రభాస్ హ్యాండ్ వరుణ్ తేజ్ కి కలిసి వస్తుందో లేదో చూడాలి.
