Homeఎంటర్టైన్మెంట్Prabhas Hanu Raghavapudi controversy: ప్రభాస్ - హను రాఘవపూడి మధ్య గొడవ జరిగిందా...అసలు ఆ...

Prabhas Hanu Raghavapudi controversy: ప్రభాస్ – హను రాఘవపూడి మధ్య గొడవ జరిగిందా…అసలు ఆ మూవీ అప్డేట్ ఏంటి..?

Prabhas Hanu Raghavapudi controversy: ‘ఈశ్వర్’ సినిమా తో తన కెరియర్ ని మొదలుపెట్టిన నటుడు ప్రభాస్…మొదటి సినిమాతోనే హీరోగా మెప్పించాడు. ఈ మూవీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించకపోయిన కూడా తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ‘రాఘవేంద్ర’ అనే సినిమా చేశాడు. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా బాగా ఎలివేట్ అయ్యాడు. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత చేసిన ‘వర్షం ‘, ‘ఛత్రపతి’ లాంటి సినిమాలతో అతను స్టార్ హీరోగా మారిపోయాడు. అలాంటి నటుడు ఇప్పుడు పాన్ ఇండియాను శాసించే స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం ప్రభాస్ తన పరిధిని విస్తరించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. పాన్ వరల్డ్ లోకి సైతం ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం మారుతి డైరెక్షన్ లో చేసిన రాజాసాబ్ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన ఎక్కడ డీలా పడకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి ఫౌజీ, అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమాల మీదనే తను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఈ క్రమంలోనే ఫౌజీ సినిమా స్టార్ట్ అయి సంవత్సర అవుతున్న కూడా ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులకు ఇవ్వడం లేదు. కారణం ఏంటనేది ఎవరికి తెలియదు. అసలు ఈ సినిమా షూటింగ్ నడుస్తుందా? లేదా అనే విషయంలో కూడా చాలావరకు కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. హను రాఘవ పూడి ప్రభాస్ మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయని అందువల్లే ఈ సినిమాని కొద్ది రోజులపాటు ఆపారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.

ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియదు గానీ, ప్రభాస్ మాత్రం ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇతను అనుకున్నట్టుగానే ఈ సినిమాని హను రాఘవపూడి టాప్ లెవల్లో చిత్రీకరిస్తున్నాడా? ఈ మూవీతో అటు ప్రభాస్ కి, ఇటు హను రాఘవపూడి కి భారీ సక్సెస్ లు దక్కుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version