https://oktelugu.com/

‘రాధేశ్యామ్’ టీమ్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

‘బాహుబలి’.. ‘సాహో’ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ ‘రాధేశ్యామ్’. గత రెండేళ్లుగా ఈ మూవీ షూటింగు జరుపుకుంటోంది. ఈ మూవీ గురించి సరైన అప్డేట్స్ లేకపోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘సాహో’ మూవీ చేస్తున్నప్పుడే యూవీ క్రియేషన్స్ ‘రాధేశ్యామ్’ మూవీపై ప్రకటన చేసింది. Also Read: వర్మ హీరోయిన్లు.. లైన్లో పడుతున్నారా? అయితే ‘సాహో’ సినిమా విషయంలో చేస్తున్న తప్పునే ‘రాధేశ్యామ్’ విషయంలో చిత్రయూనిట్ చేస్తుండటంపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సాహో విషయంలోనూ చిత్రబృందం సినిమాపై ఎలాంటి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 17, 2020 / 02:14 PM IST
    Follow us on

    ‘బాహుబలి’.. ‘సాహో’ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ ‘రాధేశ్యామ్’. గత రెండేళ్లుగా ఈ మూవీ షూటింగు జరుపుకుంటోంది. ఈ మూవీ గురించి సరైన అప్డేట్స్ లేకపోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘సాహో’ మూవీ చేస్తున్నప్పుడే యూవీ క్రియేషన్స్ ‘రాధేశ్యామ్’ మూవీపై ప్రకటన చేసింది.

    Also Read: వర్మ హీరోయిన్లు.. లైన్లో పడుతున్నారా?

    అయితే ‘సాహో’ సినిమా విషయంలో చేస్తున్న తప్పునే ‘రాధేశ్యామ్’ విషయంలో చిత్రయూనిట్ చేస్తుండటంపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సాహో విషయంలోనూ చిత్రబృందం సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా తప్పు చేసిందని.. అదే కాన్సెప్ట్ ను చిత్రబృందం ‘రాధేశ్యామ్’ విషయంలోనూ అమలు చేస్తుండటంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

    ‘రాధేశ్యామ్’ విషయంలో యూవీ క్రియేషన్ చేస్తున్న ఆలస్యంపై మండిపడుతూ ఫ్యాన్స్ గతంలోనే యూవీ క్రియేషన్స్ ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. దీంతో యూవీ క్రియేషన్ కొంత అలర్ట్ అయినట్లు కన్పించింది. అయితే ఆ తర్వాత యథావిధిగా సినిమా విషయంలో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా ప్రభాస్ అభిమానులను చికాకు పెడుతోంది.

    తాజాగా యూవీ క్రియేషన్ ‘రాధేశ్యామ్’పై ఓ ప్రకటన చేసింది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మోషన్ పోస్టర్ అభిమానులను తప్పకుండా ‘రాధే శ్యామ్’ ప్రేమలో పడేస్తుందంటూ కొద్దీ సేపటి క్రితమే ట్వీటర్లో  అప్డేట్ ఇచ్చారు.

    రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాకు సంబంధించి కనీసం టీజర్ కూడా రిలీజ్ చేయకపోవడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ‘రాధేశ్యామ్’ నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు చిత్రబృందం షాకివ్వడంపై  ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: ‘బిగ్ బాస్’ హోస్ట్ నాగార్జున ఎగ్జిట్.. రోజా ఇన్?

    ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న నాగ్ అశ్విన్ మూవీ.. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ సెట్స్ పైకి వెళ్లకుండానే ఫస్టు లుక్.. మోషన్ పోస్టర్లతో అలరిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. రాధేశ్యామ్ మాత్రం రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ట్రైలర్ కూడా రిలీజ్ చేయకపోవడం యూవీ క్రియేషన్స్ పనితీరుకు నిదర్శమని ప్రభాస్ ప్యాన్స్ మండిపడుతున్నారు.