Baahubali 3: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ రాజమౌళి చేసిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మన వాళ్ళు వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతుండటం విశేషం… ఇక బాహుబలి రెండు పార్టులుగా వచ్చి సూపర్ సక్సెస్ సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక బాహుబలి 3 ఉంటుంది అంటూ మొదటి నుంచి కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్న మేకర్స్ ఇప్పుడు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేశారు. ‘బాహుబలి ది టార్చ్ బేరర్’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది ఇది టెలికాస్ట్ అవ్వడానికి ముందే బాహుబలి 3 ఉంటుందంటూ ఒక వీడియో అయితే అనౌన్స్ చేశారు… ఇక ప్రపంచం మొత్తం బాహుబలి 3 మూవీ వస్తుందని ఊహించలేదు మీ అందరి కోసం బాహుబలి మూడో భాగం రాబోతుంది అంటూ ప్రభాస్, రానా, అనుష్క వెల్లడించారు. ఇక ఈ వీడియోలో అనుష్క గురించి ప్రభాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అనుష్క ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే దాదాపు 40 నిమిషాల పాటు ఆపకుండా నవ్వుతూనే ఉంటుందని బాహుబలి సినిమా షూటింగ్ బ్రేక్ టైమ్ లో తను చాలాసార్లు అలా నవ్వేదని చెప్పాడు.
అలాగే కొన్ని సందర్భాల్లో అయితే తన సెట్స్ కి వచ్చే ముందు నవ్వకూడదు అనే ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చేదని ఒకవేళ నవ్వితే అక్కడ షూటింగ్ కి ఇబ్బంది అయ్యేదని దానివల్ల కోటా రూపాయలను ఖర్చు పెట్టి సినిమాను చేస్తున్న ప్రొడ్యూసర్ కి నష్టం వాటిల్లే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతోనే ఆమె అలా నవ్వకూడదు అనే ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చేది అంటూ ప్రభాస్ అనుష్క మీద కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశాడు.
అలాగే బాహుబలి సినిమా అనేది తనకొక ఎమోషనల్ జర్నీ అంటూ ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు… ఇక సత్యరాజు మాట్లాడుతూ బాహుబలి సినిమా షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు కాస్ట్యూమ్స్ విపరీతంగా ఉండేవని కనుచూపుమేరలో ఎటు చూసినా కూడా కాస్ట్యూమ్స్ కనిపించేవని వాటన్నిటిని చూస్తే ఆశ్చర్యం వేసేది అంటూ ఆయన మాట్లాడాడు…
ఇక రాజమౌళి సైతం గతంలో ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమా ప్రమోషన్స్ టైమ్ లో కూడా ‘బాహుబలి 3’ సినిమా ఉంటుందంటూ క్లారిటి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో రావడంతో బాహుబలి 3 సినిమా ఉంటుంది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ప్రేక్షకులను ఎలా ఎంగేజ్ చేయగలుగుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
