Prabhakar Apologized: పిల్లలు చేసే పనులకు తల్లిదండ్రులు ఏనాడూ కూడా క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి రాకూడదు. పిల్లల కారణం గా తల్లిదండ్రులు ఎప్పుడూ తల ఎత్తుకొని గర్వపడే స్థాయిలోనే ఉండాలి. ఒకవేళ క్షమాపణలు చెప్పుకునే రోజుకి వాళ్ళని దిగజారిస్తే, పిల్లలకు మహాపాపం తగులుతుంది అంటూ పెద్దలు అంటూ ఉంటారు. పాపం ఇప్పుడు ఇది టీవీ సీరియల్ సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కి వర్తిస్తుంది . తన కొడుకు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్(Attitude Chandrahas) రీసెంట్ గానే ‘బారాబర్ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, అందరూ చూస్తుండగా, బూతు పాట పాడి ఎంతటి కలకలం సృష్టించాడో మన అందరికీ తెలిసిందే. యూత్ ఆడియన్స్ నచ్చుతారు అనే ఉద్దేశ్యంతో, సినిమాలో ఆ పాట లేకపోయినా కూడా స్వయంగా లిరిక్స్ రాసుకొచ్చి మరీ ఈ పాట పాడాడు. దీంతో సోషల్ మీడియా భగ్గుమంది, తెలుగు సినిమా సాహిత్యం పరువు తీస్తున్నారంటూ చంద్రహాస్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇందుకు చంద్రహాస్ క్షమాపణలు చెప్పాడు, అంతే కాకుండా తన ‘బారాబర్ ప్రేమిస్తా’ మూవీ విడుదల రోజు థియేటర్ లో మీడియా తో మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగుంది..కానీ నామీద ఏర్పడిన ఈ నెగటివిటీ కారణంగా సినిమాకు జనాలు రారేమో అని భయం వేస్తోంది’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతే తన తప్పు ఏంటో పూర్తిగా తెలుసుకున్నాడు. అయితే కోట్లు పెట్టి తీసిన సినిమా తన కొడుకు వాళ్ళ నష్టాలకు గురి అవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో చంద్రహాస్ తండ్రి ప్రభాకర్ కూడా ఆడియన్స్ కి క్షమాపణలు చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘మా అబ్బాయి తప్పు చేసాడు. అది నేను వ్యక్తిగతంగా వాడికి వివరించి చెప్పాను, వాడు తన తప్పుని తెలుసుకున్నాడు. కానీ సోషల్ మీడియా లో కొంతమంది నా కుటుంబాన్ని అతి నీచమైన భాషతో దూషిస్తూ వాడికంటే పెద్ద తప్పులు చేస్తున్నారు. నా కుటుంబం గురించి చాలా చెత్తగా మాట్లాడుతున్నారు’.
‘నా అబ్బాయిని పద్దితిగానే పెంచాను. ఎదో సినిమాకు ప్రొమోషన్స్ కోసం తెలిసి తెలియని తనంతో అలా చేసాడు. వాడి తరుపున నేను మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నాను. నేను పిలవగానే జేడీ చక్రవర్తి, జయంత్ వంటి వారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. నా వల్ల వాళ్ళు కూడా మాటలు పడాల్సి వచ్చింది. వాళ్లకు కూడా ఈ సందర్భంగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ ప్రభాకర్ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడిన మాటలను ఈ క్రింది వీడియో లో చూడండి. ఇకపోతే ‘బారాబర్ ప్రేమిస్తా’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఏ యూత్ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకొని చంద్ర హాస్ ఆ పాట పాడి అబాసుపాలయ్యాడో, ఆ యూత్ ఈ చిత్రం పై కన్నెత్తి కూడా చూడలేదు. రాబోయే రోజుల్లో చంద్రహాస్ తన తీరుని పూర్తి గా మార్చుకొని మంచి సినిమాలు చేస్తాడని ఆశిద్దాం అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
