SriLeela: పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీల తండ్రి ఆయన కాదట.. సంచలన నిజం వెలుగులోకి..

SriLeela:‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముగ్దమనోహర అందం ‘శ్రీలీల’. ఈమె అందానికి జనాలు ఫిదా అయిపోయి ఈమెకోసమే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తున్న పరిస్థితి నెలకొంది. సినిమాకు అంత పాజిటివ్ టాక్ రాకున్నా శ్రీలీల కోసం ఇప్పుడు థియేటర్లకు వస్తున్నారంటే అతిశయోక్తి కాదు.. ఈ క్రమంలోనే శ్రీలీల ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారన్నది హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. శ్రీలీల ప్రవాస భారతీయురాలు. అమెరికాలోని మిచిగాన్ లో గల డెట్రాయిట్ లో […]

Written By: NARESH, Updated On : October 18, 2021 1:28 pm
Follow us on

SriLeela:‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముగ్దమనోహర అందం ‘శ్రీలీల’. ఈమె అందానికి జనాలు ఫిదా అయిపోయి ఈమెకోసమే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తున్న పరిస్థితి నెలకొంది. సినిమాకు అంత పాజిటివ్ టాక్ రాకున్నా శ్రీలీల కోసం ఇప్పుడు థియేటర్లకు వస్తున్నారంటే అతిశయోక్తి కాదు.. ఈ క్రమంలోనే శ్రీలీల ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారన్నది హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

Pelli SandaD Heroine Sree Leela

శ్రీలీల ప్రవాస భారతీయురాలు. అమెరికాలోని మిచిగాన్ లో గల డెట్రాయిట్ లో 2001, జూలై 14న జన్మించింది. ఈమె ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా వెలుగులోకి వచ్చింది.. ఈమె స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. తల్లిదండ్రులు అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు. శ్రీలీల సంప్రదాయ కన్నడ కుటుంబంలో జన్మించింది. ఈమెకు శ్రీకర్, శ్రీదీప్ అనే ఇద్దరు సోదరులున్నారు. ఈమె తల్లి డాక్టర్ స్వర్ణలత.. తండ్రి పేరు శుభాకర్ రావు సురపనేని అని పేరు బయటకు వచ్చిది. ఈయన ప్రముఖ వ్యాపారవేత్త. శ్రీలీల తల్లి డాక్టర్ అయినందున.. ఈమె కూడా చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని తపనపడింది. చదువులో ఎప్పుడూ ముందుడేది. తెలుగు కూడా శ్రీలలకు వచ్చింది. ఈమె మంచి డ్యాన్సర్ కూడా.. 8 ఏళ్ల వయసు నుంచే క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకుంది. ఈమెకు నటన ఇష్టం కావడంతో సినిమాల్లో నటిస్తూనే   మెడిసిన్ చదివింది. కాలేజీలో ఉండగా అన్నింట్లో ఉత్సాహంగా ఉన్న శ్రీలీలను స్నేహితులు మోడలింగ్ చేయమని ప్రోత్సహించడంతో ఆమె సినిమాల్లోకి వచ్చేసింది. 2019 సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ‘కిస్’ సినిమాతో కన్నడలో శ్రీలీల మెరిసింది. ప్రస్తుతం పెళ్లిసందడి మూవీతో శ్రీలీల క్రేజ్ అమాంతం ఎగిసింది.

ఈ క్రమంలోనే శ్రీలీల తండ్రి ఎవరు అని కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఆరాతీయగా.. ఓ పెద్ద పారిశ్రామికవేత్త అని.. ఆయన పేరు సూరపనేని శుభాకరరావు అంటూ ప్రచారం సాగింది. దీన్ని శ్రీలీల కూడా ఖండిచకపోవడం గమనార్హం.

అయితే తాజాగా వ్యాపారవేత్త శుభాకరరావు మీడియా ముందుకొచ్చాడు. పెళ్లిసందడి హీరోయిన్ శ్రీలీల తన కూతురు కాదంటూ ప్రకటించారు. ఆమె తన మాజీ భార్య కూతురు అని.. మేం ఇద్దరం 20 ఏళ్ల కిందటే విడిపోయామని.. తాను విడాకులు తీసుకున్నాక శ్రీలీల పుట్టిందని.. ఆమెకు తాను తండ్రి కాదని శుభకర్ ప్రకటించడం సంచలనమైంది.

ఇప్పటిదాకా శుభకర్ రావు తండ్రి అని జోరుగా ప్రచారం సాగడంతో ఆయనకు ఇబ్బందిగా మారింది. దీంతో దీనిపై సొసైటీలో కూడా ఆయన ఫిర్యాదు చేశారట.. ఇప్పటికీ శ్రీలీల తల్లికి, శుభాకర్ కు మధ్య విడాకులు, ఆర్థిక లావాదేవీలు గొడవలున్నట్టు టాక్. శ్రీలీలకు తాను తండ్రిని కాదని తాజాగా ప్రకటించడం ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.

పెళ్లిసందడి మూవీలో శ్రీలీలను చూసిన జనాలు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మాయి కోసమైనా సినిమా చూడాలని యూత్ క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. కన్నడలో ‘బై టు లవ్’, ‘జుబారియా’ అనే సినిమాల్లో నటిస్తోంది శ్రీలీల. ఈమె సినిమాల్లన్నీ మంచి విజయాలు సాధించాలని..తెలుగులో మరో ‘శ్రీదేవి’ అంత ఎత్తుకు ఎదగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.. ఆల్ ది బెస్ట్ శ్రీదేవి.