Pawan Kalyan Surender Reddy Film: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు పాలిటిక్స్ లో రాణిస్తూనే, ఇటు సినిమాలు చేస్తు ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నాడు. గత సంవత్సరం ఆయన చేసిన ఓజీ మూవీ హరి విజయాన్నినాధించింది. ఈనెల 19వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అయితే రాలేదు. వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ రెండో సినిమాకి ఏ రేంజ్ సక్సెస్ దక్కుతుంది అనేది తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం కళ్యాణ్ ఫ్రీగా ఉన్నాడు. ఇంతకుముందు కమిట్ అయిన సినిమాలన్నింటిని కంప్లీట్ చేశాడు. దాంతో మరో రెండు సినిమాలు కమిట్ అవ్వాలని చూస్తున్నాడు. రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమా కథను విన్న పవన్ కళ్యాణ్ కొంచెం మార్చమని సురేందర్ రెడ్డి కి చెప్పారట.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!
సెకండ్ వెర్షన్ సురేందర్ రెడ్డి చెప్పినప్పటికి పవన్ కళ్యాణ్ అంత సంతృప్తిగా లేడు. కానీ సురేందర్ రెడ్డికి సినిమా చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి ఆ కథని ఫైనల్ చేసే బాధ్యతను త్రివిక్రమ్ కి అప్పజెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో త్రివిక్రమ్ కొన్ని మార్పులు చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయాలో కూడా ప్రస్తుతం త్రివిక్రమ్ డిసైడ్ చేస్తున్నాడనేది వాస్తవం… ఆయన ఏ సినిమాని చేయమంటే పవన్ కళ్యాణ్ ఆ సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా త్రివిక్రమ్ చాలా పకడ్బందీగా రాస్తున్నాడు…
సురేందర్ రెడ్డి తో డిస్కస్ చేసి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని త్రివిక్రమ్ ఆడ్ చేశారట. దాంతో కథలో ఇంకా పొటెన్షియాలిటీ వచ్చిందని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరి ఫైనల్ వెర్షన్ విన్న తర్వాత ఏం చెబుతాడు అనే దాని గురించి అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…
