
‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్ సినిమాల రేంజ్ ప్రపంచవ్యాప్తమైంది. ప్రభాస్ ఈ సినిమా దెబ్బకు ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలన్నీ దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి.
ఇక జక్కన్న రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రాంచరణ్, ఎన్టీఆర్ లు సైతం ప్యాన్ ఇండియా స్టార్లు అయిపోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు కూడా అదేప్లాన్ లో ఉన్నాడు. ఇప్పటికే హిందీ యాడ్స్ లో మహేష్ నటించాడు.
ఈక్రమంలోనే వీరందరి కంటే క్రేజ్ తెలుగు నాట పవన్ కళ్యాణ్ సొంతం. కానీ ఆయన మాత్రం రాజకీయ యావలో పడి అసలు సినిమాలను, ప్యాన్ ఇండియా తరహా ఎదగాలని ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు టైం వచ్చింది.
క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పవన్ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తీర్చిదిద్దుతున్నారట.. ఈ సినిమా కథ అలాంటిది మరీ. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో 17వ శతాబ్ధానికి చెందిన వజ్రాల దొంగగా నటిస్తున్నాడట.. ఇందులో మొఘల్ పాలన, ఔరంగజేబు అరాచకాలు, సిక్కుల పోరాటం లాంటివి ఉన్నాయట.. దీంతో ఇది ఉత్తరాది కథ కూడా కావడంతో దీన్ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
‘హరహర వీరమల్లు’ అనే టైటిల్ ను దీనికి ఫిక్స్ చేశారు. ఇందులో హిందీ హీరో అర్జున్ రాంపాల్, హీరోయిన్ జాక్వెలెన్ ఫెర్నాండేజ్ కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు కూడా ఉండడంతో దీన్ని ప్యాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని క్రిష్ భావిస్తున్నాడట.. సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ కు నిర్మాత ఏఏం రత్నం ప్లాన్ చేశారు.
వీరమల్లుతో పవన్ సైతం హిందీ బాటపడుతున్నాడని.. అతడు ప్యాన్ ఇండియా హీరో గుర్తింపు వస్తుందని పవన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. శివరాత్రికి ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.