https://oktelugu.com/

పవన్ ను సీఎం చేసేందుకు రెడీ అవుతున్న మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో బీజీగా మారారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశారు. చిత్రసీమలో తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. తన డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా’ను కాంప్లీట్ చేశారు. ‘సైరా నర్సింహారెడ్డి’ పాత్రకు చిరంజీవి తప్ప వేరే నటుడు న్యాయం చేయలేరన్న రీతిలో నటించి మెప్పించారు. తాజాగా కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్నారు. ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. నక్సలైట్ పాత్రలో చిరు […]

Written By: , Updated On : May 7, 2020 / 12:28 PM IST
Follow us on


మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో బీజీగా మారారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశారు. చిత్రసీమలో తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. తన డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా’ను కాంప్లీట్ చేశారు. ‘సైరా నర్సింహారెడ్డి’ పాత్రకు చిరంజీవి తప్ప వేరే నటుడు న్యాయం చేయలేరన్న రీతిలో నటించి మెప్పించారు. తాజాగా కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్నారు. ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. నక్సలైట్ పాత్రలో చిరు కన్పిస్తాడనే ప్రచారం జరుగుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే మెగాస్టార్-పవర్ స్టార్ కాంబోలో త్వరలో ఏ మూవీ రాబోతుందనే వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుండటం అందరిలో ఆసక్తిని రేపుతోంది.

విశాఖలో భారీ ప్రమాదం…!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో బీజీగా మారిపోయాయి. ప్రజాసేవకే ప్రాధాన్యమని పవర్ స్టార్ ప్రకటించడంతో పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడనే ప్రచారం జరిగింది. అయితే ఇటీవలీ కాలంలో పవర్ స్టార్ వరుస సినిమాలకు కమిటవుతూ అభిమానుల్లో జోష్ నింపారు. ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. చివరి దశకు చేరుకున్న ‘వకీల్ సాబ్’ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ‘ఆచార్య’ మూవీతో తర్వాత మెగాస్టార్ చేయబోయే మలయాళ రీమేక్ ‘లూసీఫర్’లో పవర్ స్టార్ నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం డెలివరీ!

గతంలోనూ మెగాస్టార్-పవర్ స్టార్ కాంబినేషన్లో ఓ మూవీ వచ్చింది. ‘శంకర్ దాదా జిందాబాద్’లో పవన్ కల్యాణ్ గెస్ట్ రోల్ చేసి మెప్పించాడు. ఇక ‘లూసీఫర్’ కథలో భాగంగా ముఖ్యమంత్రి మరణించగా అతడి వారసుడిగా ఒక హీరో పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఈ పాత్రకు మోహన్‌లాల్ ట్రైనింగ్ ఇచ్చి సీఎం కుర్చీలో కూర్చునేలా చేస్తాడు. తెలుగు రీమేక్‌లో ఆ పాత్రను పవన్‌తో చేయిస్తే బాగుంటుందని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు ఈ పాత్ర పవన్ చేస్తే రాజకీయంగాను అతడి హెల్ప్ అవుతుందని మెగాస్టార్ భావిస్తున్నారట. పవన్ పాత్రకు 15నిమిషాల నిడివి ఉండనుందని సమాచారం. మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరు కూడా రీ ఎంట్రీ తర్వాత ఒకే మూవీలో నటించనున్నారని తెలియడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అన్ని అనుకూలిస్తే పవర్ స్టార్ ను అభిమానులు సీఎం కూర్చీలో చూడటం ఖాయంగా కన్పిస్తోంది. అయితే పవన్ ఈ సినిమాను చేస్తారా? లేదో వేచి చూడాల్సిందే..!