BalaKrishna- Nagarjuna: బాలయ్య, నాగార్జున కాంబో లో రావాల్సిన మల్టీ స్టారర్ సినిమా ఎలా మిస్ అయిందో తెలుసా..?

అందుకే ఇండస్ట్రీకి ఎంతమంది హీరోలు వచ్చినప్పటికీ ఈ హీరోలకి మాత్రం సపరేట్ క్రేజ్ ఉండటమే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్క తెలుగు వాడికి గుర్తుండిపోతారనే చెప్పాలి. ఇక వీళ్లిద్దరూ కలిసి చాలా మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు.

Written By: Neelambaram, Updated On : February 26, 2024 9:57 am

balakrishna nagarjuna

Follow us on

BalaKrishna- Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లను ఇండస్ట్రీ కి రెండు కండ్లు గా చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో వాళ్లు ఇండస్ట్రీకి చేసిన సేవలు అలాంటివి. వీళ్ళిద్దరూ మంచి సినిమాలను చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ఒకానొక సమయంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి మనకి మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ అప్పుడు హైదరాబాద్ లో లేదు చెన్నైలోనే ఉండేది. అయినప్పటికీ తమిళ్ హీరోలు మన హీరోలను చాలావరకు డామినేట్ చేస్తూ సినిమాలు చేసేవారు. అయిన కూడా మన హీరోలు అయిన ఎన్టీఆర్, నాగేశ్వరరావు లు ఎక్కడ తగ్గకుండా వరుస సినిమాలు చేసి మన తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపించారు.

అందుకే ఇండస్ట్రీకి ఎంతమంది హీరోలు వచ్చినప్పటికీ ఈ హీరోలకి మాత్రం సపరేట్ క్రేజ్ ఉండటమే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్క తెలుగు వాడికి గుర్తుండిపోతారనే చెప్పాలి. ఇక వీళ్లిద్దరూ కలిసి చాలా మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు. ఇక ఇది ఇలా ఉంటే వీళ్ళ తర్వాత వీళ్ళ కొడుకులు కూడా ఇండస్ట్రీ కి వచ్చారు. ముఖ్యంగా ఎన్టీయార్ కొడుకు అయిన బాలకృష్ణ.. నాగేశ్వరరావు కొడుకు అయిన నాగార్జున ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలను అందుకుంటు ముందుకెళ్లారు. వీళ్ళ ఫాదర్స్ చేసినట్టుగానే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో కూడా ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలని బాలయ్య, నాగార్జున అనుకున్నారు.

అందులో భాగంగానే మలయాళం సూపర్ హిట్ అయిన ‘క్రిస్టియన్ బ్రదర్స్’ అనే సినిమాను రీమేక్ చేద్దామనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఇక దాంతో ఆ సినిమాను అలాగే వదిలేశారు. ఆ తర్వాత స్ట్రెయిట్ కథతో మల్టీ స్టారర్ సినిమా చేద్దామనుకున్నప్పటికీ వీళ్ళ ఇమేజ్ కు సరిపడే కథ దొరక్కపోవడంతో వీళ్ళు మల్టీ స్టారర్ సినిమా చేయలేకపోయారు… దాంతో నందమూరి, అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు. ఇక ఇప్పుడున్న పరిస్థితి లో అయితే వీళ్ళ కాంబో లో మల్టీ స్టారర్ సినిమా రావడం అసాధ్యమనే చెప్పాలి…