Unstablable with NBK : ‘అన్ స్థాపబుల్ విత్ NBK’ షోకి ఎన్టీఆర్ – మోక్షజ్ఞ.. నందమూరి ఫాన్స్ కి ఇక పండగే

Unstablable with NBK : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే..ఆహా మీడియా ని మరోలెవెల్ కి తీసుకెళ్లింది ఈ టాక్ షో..అయితే మొదటి సీజన్ తో పోలిస్తే రెండవ సీజన్ కి రెస్పాన్స్ కాస్త తగ్గిందనే చెప్పాలి..మొదటి సీజన్ లో పాల్గొన్న సెలబ్రిటీస్ అందరూ టాప్ స్టార్స్..కానీ రెండవ సీజన్ లో మాత్రం మీడియం రేంజ్ సెలెబ్రిటీలే ఎక్కువ వస్తున్నారు. […]

Written By: NARESH, Updated On : November 30, 2022 9:08 pm
Follow us on

Unstablable with NBK : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే..ఆహా మీడియా ని మరోలెవెల్ కి తీసుకెళ్లింది ఈ టాక్ షో..అయితే మొదటి సీజన్ తో పోలిస్తే రెండవ సీజన్ కి రెస్పాన్స్ కాస్త తగ్గిందనే చెప్పాలి..మొదటి సీజన్ లో పాల్గొన్న సెలబ్రిటీస్ అందరూ టాప్ స్టార్స్..కానీ రెండవ సీజన్ లో మాత్రం మీడియం రేంజ్ సెలెబ్రిటీలే ఎక్కువ వస్తున్నారు.

చివరి ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడని రూమర్స్ ఉన్నప్పటికీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు..ఇప్పటి వరుకు నాలుగు ఎపిసోడ్స్ ప్రసారమైతే , చంద్ర బాబు నాయుడు – లోకేష్ , శర్వానంద్ – అడవి శేష్, విశ్వక్ సేన్ – సిద్దు జొన్నలగడ్డ మరియు కిరణ్ కుమార్ రెడ్డి – రాధికా – సురేష్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు..త్వరలో ప్రసారం అవ్వబొయ్యే ఐదవ ఎపిసోడ్ కి నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు మరియు దర్శకులు సింగీతం శ్రీనివాస రావు మరియు రాఘవేంద్ర రావు హాజరు కాబోతున్నారు.

ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే త్వరలోనే ఈ షో కి ఎన్టీఆర్ – మోక్షజ్ఞ ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది..ఇదే కనుక నిజమైతే ఈ ఎపిసోడ్ కి టీఆర్పీ రేటింగ్స్ బద్దలు అవ్వడం ఖాయం అనే చెప్పొచ్చు..చివరి ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవేళ ముఖ్య అతిధిగా హాజరు కాలేకపోతే ఇలా చేస్తే ఎలా ఉంటుందని ఆహా టీం ప్లాన్ చేస్తుందట..ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ని ఆహా టీం వాళ్ళు సంప్రదించినట్టు సమాచారం.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మొదటి నుండి నందమూరి కుటుంబం మా హీరో ని తొక్కేయాలని చూస్తున్నారంటూ సోషల్ మీడియా లో తరుచూ ఆరోపణలు చేస్తూనే ఉంటారు..ఈ షో ద్వారా అలాంటి ఆరోపణలకు చెక్ పెట్టాలనే ఆలోచనలో బాలయ్య బాబు ఉన్నట్టు తెలుస్తుంది..నందమూరి కుటుంబం ఎప్పటికి చీలిపోదు..మేమంతా ఒక్కటే అని చెప్పడానికి ఈ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారట.