Sameera Reddy : అవి పెద్దగా కనిపించాలని ప్యాడ్స్ వాడాను, ఆ పనిచేశా: ఎన్టీఆర్ హీరోయిన్
గర్భం దాల్చిన సమయంలో సమీరా రెడ్డి ఫోటో షూట్ చేయడం విశేషం. చివరి సారిగా తెలుగులో కృష్ణం వందే జగత్ గురుమ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. 2013లో నటనకు గుడ్ బై చెప్పింది...
Sameera Reddy : తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా… సమీరా రెడ్డి ఫేమ్ రాబట్టింది. ఆమె మీద కొన్ని రూమర్స్ కూడా వినిపించాయి. 2002లో మైనే దిల్ తుజ్కో దియా చిత్రంతో సమీరా రెడ్డి వెండితెరకు పరిచయమైంది. బాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్న ఆమెను దర్శకుడు బి గోపాల్ టాలీవుడ్ కి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ తో ఆయన చేసిన నరసింహుడు చిత్రానికి హీరోయిన్ గా ఎంపిక చేశాడు. నరసింహుడు మూవీలో సమీరా రెడ్డి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అయితే ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది.
ఎన్టీఆర్ సరసన ఆమెకు మరో ఛాన్స్ వచ్చింది. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అశోక్ మూవీలో ఎన్టీఆర్-సమీరా రెడ్డి జతకట్టారు. అప్పుడే వీరి మధ్య ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. సమీరా రెడ్డితో ఎన్టీఆర్ పెళ్ళికి సిద్ధం అయ్యాడంటూ కథనాలు వెలువడ్డాయి. హరికృష్ణ కట్టడి చేయడంతో వాళ్ళ ఎఫైర్ కి తెరపడిందన్నారు. ఈ పుకార్ల అనంతరం సమీరా రెడ్డి టాలీవుడ్ కి దూరమైంది. మధ్యలో చిరంజీవికి జంటగా జై చిరంజీవ చిత్రం చేసింది.
2014లో బిజినెస్ మ్యాన్ అక్షయ్ వార్డే ను వివాహం చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. కాగా సమీరా రెడ్డి పలుమార్లు బాడీ షేమింగ్ కి గురయ్యారట. కెరీర్ బిగినింగ్ లో తన శరీరం పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారట. ఒక దశలో ఆమె బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉందని కొందరు ఆరోపణలు చేశారట. సర్జరీ చేయించుకుని బ్రెస్ట్ సైజ్ పెంచుకోవాలని సలహా ఇచ్చారట.
ఈ కామెంట్స్ ఆమెను ఒత్తిడికి గురి చేశాయట. ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారట. బ్రెస్ట్ పెద్దదిగా కనిపించేందుకు ప్యాడ్స్ వాడేదట. సర్జరీకి కూడా ఆమె సిద్ధం అయ్యారట. దానికి సంబంధించిన సమాచారం సేకరించిందట. అయితే సర్జరీ చేయించుకోలేదని సమీరా రెడ్డి వెల్లడించారు. కాగా గర్భం దాల్చిన సమయంలో సమీరా రెడ్డి ఫోటో షూట్ చేయడం విశేషం. చివరి సారిగా తెలుగులో కృష్ణం వందే జగత్ గురుమ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. 2013లో నటనకు గుడ్ బై చెప్పింది…