https://oktelugu.com/

జగన్ లేఖపై ఎవరూ మాట్లాడొద్దు.. వైసీపీ కఠిన ఆదేశం?

కాగల కార్యం గంధర్వుడే  తీర్చాడు.. ఎక్కడ ఎవరికి తాకాలో వారికే తాకింది. దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇక చిన్న నాయకులతో ఏం పని. అందుకే అందరూ మౌనం దాల్చాలని..ఎవరూ ఈ వివాదాస్పద అంశంపై నోరు తెరవద్దని వైసీపీ అధిష్టానం వైసీపీ నేతలందరికీ స్టిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసినట్టు సమాచారం.. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. Also Read: జగన్‌ దర్శనం కోసం ఆ ‘పూజారి’ ఆశీర్వాదం తప్పనిసరి..! సీఎం జగన్ సుప్రీం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2020 / 10:29 AM IST
    Follow us on

    కాగల కార్యం గంధర్వుడే  తీర్చాడు.. ఎక్కడ ఎవరికి తాకాలో వారికే తాకింది. దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇక చిన్న నాయకులతో ఏం పని. అందుకే అందరూ మౌనం దాల్చాలని..ఎవరూ ఈ వివాదాస్పద అంశంపై నోరు తెరవద్దని వైసీపీ అధిష్టానం వైసీపీ నేతలందరికీ స్టిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసినట్టు సమాచారం.. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది.

    Also Read: జగన్‌ దర్శనం కోసం ఆ ‘పూజారి’ ఆశీర్వాదం తప్పనిసరి..!

    సీఎం జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ ప్రకంపనలు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఓ సుప్రీం కోర్టు జడ్జి మీద.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మేనేజ్ మెంట్ మీద జగన్ రాసిన లేఖ ఇప్పటికీ చర్చనీయాంశమైంది. దీనిపై సెగలు, పొగలు రగులుతూనే ఉన్నాయి.

    ఈ క్రమంలోనే వైసీపీ నేతలు మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం తప్పితే సీఎం జగన్ నుంచి ఏ వైసీపీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే కూడా స్వయంగా మీడియాతో స్పందించడం లేదు. ఎందుకు? అంటే ఆల్ రెడీ వారికి ఆదేశాలు అందాయని ప్రచారం సాగుతోంది.

    తాజాగా వైఎస్ జగన్ రాసిన లేఖపై ఏ వైసీపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరూ మాట్లాడవద్దంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించినట్టు ప్రచారం సాగుతోంది. వారి వాట్సాప్ గ్రూపులో ఈ మేరకు వైసీపీ నేతలకు ఈ సందేశాన్ని పంపినట్టు సమాచారం.

    Also Read: రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ..?

    సీఎం జగన్ ఇప్పటికే లేఖ రూపంలో ఈ విషయాన్ని తెలియజేశారని.. దయచేసి నేతలు ఎవరూ ఈ అంశంపైన మీడియాతో మాట్లాడవద్దని.. స్పందించవద్దని కఠిన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఆ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై అధికారికంగా తెలియాల్సి ఉంది.