https://oktelugu.com/

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు.. వైఎస్ షర్మిల క్లారిటీ

ప్రతి ఆదివారం ‘కొత్త పలుకు’ పేరిట ఓ టీడీపీ అనుకూల పత్రిక యజమాని తన పత్రికలో వండి వార్చే వ్యాసాలు ఫక్తు ఏపీలోని సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూనే ఉంటాయి. అయితే ఈ వారం కాస్త వెరైటీగా సీఎం జగన్ చెల్లెలు షర్మిలను టార్గెట్ చేసి ఓ అద్భుతమైన కథను అల్లారు. అదేంటంటే ‘షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతోందని.. రంగం సిద్ధమైందని’రాసుకొచ్చారు.ఈ కథనం రెండు రాష్ట్రాలను షేక్ చేసింది. Also Read: ఎన్నికలకు సై: జగన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 25, 2021 / 09:57 PM IST
    Follow us on

    ప్రతి ఆదివారం ‘కొత్త పలుకు’ పేరిట ఓ టీడీపీ అనుకూల పత్రిక యజమాని తన పత్రికలో వండి వార్చే వ్యాసాలు ఫక్తు ఏపీలోని సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూనే ఉంటాయి. అయితే ఈ వారం కాస్త వెరైటీగా సీఎం జగన్ చెల్లెలు షర్మిలను టార్గెట్ చేసి ఓ అద్భుతమైన కథను అల్లారు. అదేంటంటే ‘షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతోందని.. రంగం సిద్ధమైందని’రాసుకొచ్చారు.ఈ కథనం రెండు రాష్ట్రాలను షేక్ చేసింది.

    Also Read: ఎన్నికలకు సై: జగన్ ఓడాడు.. నిమ్మగడ్డనే గెలిచాడు..

    ఏపీలో వైసీపీ పార్టీ ఉండగా.. తెలంగాణలోనూ దాన్ని కంటిన్యూ చేయకపోగా కొత్త పార్టీ షర్మిల ఎందుకు పెడుతోంది.? జగన్ తో విభేదాలా? అన్న ఊహాగానాలు వినిపించాయి. ఓ అడుగు ముందుకేసి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అయితే.. ‘జగన్ తన చెల్లెలును రాజకీయంగా తొక్కేశాడని.. విశాఖ ఎంపీ సీటు ఇవ్వలేదని.. అందుకే ఆమె తెలంగాణలో పార్టీ పెడుతోందని’ విమర్శించాడు. తెలంగాణ కంటే అన్నకు వ్యతిరేకంగా ఏపీలో పెట్టు అని సలహా ఇచ్చాడు.

    అయితే ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో రచ్చ కావడంతో తాజాగా జగన్ చెల్లెలు షర్మిల అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన పత్రిక, చానెల్ మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని వైఎస్ షర్మిల హెచ్చరించారు.ఈ మేరకు ఒక పత్రిక ప్రకటనను షర్మిల విడుదల చేశారు.

    Also Read: పవన్ కళ్యాణ్ ను త్యాగపురుషుడిని చేస్తున్న సోము వీర్రాజు?

    తాను పార్టీ పెట్టబోతున్న కథనం రాసిన విషయం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందని.. ఆ కథనాన్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలుగా షర్మిల ఆరోపించారు. ఈ కథనాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఏ పత్రిక, ఏ చానెల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పు అని విమర్శించారు.అది నీతిమాలిన చర్య అన్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్