Site icon OkTelugu

షాకింగ్: సాయిధరమ్ ‘రిపబ్లిక్’ టీజర్

విలక్షణ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘రిపబ్లిక్’ అనే మూవీ అనౌన్స్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా దాన్నే టైటిల్ గా పెట్టారు. తాజాగా చిత్రం టైటిల్ తో మోహన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read: లవ్ స్టోరీ కోసం నాని ‘టక్ జగదీష్’ వాయిదా?

ఈ సినిమాకు సీరియస్ సబ్జెక్ట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం, ధర్మంతోనే నిలబడుతుందనేలా సాయిధరమ్ తేజ్ వాయిస్ ఓవర్ తో విడుదలైన మోషన్ పోస్టర్ చూస్తే సమకాలీన రాజకీయాలను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది.

మోషన్ పోస్టర్ లో మూడు గుర్రాలు, ఓ రథాన్ని యానిమేషన్ చేశారు. ఈ మూడు సాగినప్పుడే ప్రజాస్వామ్యం నడుస్తుందనేలా ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read: చైతన్య మెసేజ్ కు నిహారిక కన్నీళ్లు… !

అయితే ఇంతటి సీరియస్ సబ్జెక్ట్ ను యువ హీరో సాయిధరమ్ తేజ్ హ్యాండిల్ చేయగలడా? ఇలా పాత్రల్లో నటించి మెప్పించగలడా? అన్నది ప్రశ్న..? ఇప్పటివరకు ఫ్యామిలీ, లవ్ సినిమాల్లో నటించిన సాయిధరమ్ కు ఈ సబ్జెక్ట్ కత్తిమీద సామే అంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో?

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Exit mobile version