spot_img
Homeఎంటర్టైన్మెంట్Neena Gupta Pregnant: 66 ఏళ్ళ వయస్సులో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు!

Neena Gupta Pregnant: 66 ఏళ్ళ వయస్సులో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు!

Neena Gupta Pregnant: సమాజం లో ఎవరు ఏమనుకుంటారో అనే భయం లేకుండా, తమ మనసుకి నచ్చే విధంగా బ్రతికే మనుషులు చాలా మంది ఉంటారు. అలా సినీ సెలబ్రిటీల్లో కూడా చాలా మంది ఉన్నారు. కానీ సమాజం దృష్టిలో మాత్రం పైకి మామూలుగానే కనిపిస్తున్నట్టు నటిస్తుంటారు. అలాంటి వాళ్ళు కాకుండా, ఎవరేమి అనుకున్నా పర్వాలేదు , నాకు నచ్చినట్టు నేనుంటా అని అనుకుంటే సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు నీనా గుప్త(Neena Gupta). బాలీవుడ్ లో హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపుగా 44 ఏళ్ళ నుండి నటిస్తూ , ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె , ఇప్పటికీ కూడా సోషల్ మీడియా లో హాట్ ఫోటో షూట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అంతే కాదు, మహిళల హక్కుల గురించి మాట్లాడడం లో కూడా ఈమె ఎప్పుడూ ముందు ఉంటుంది.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!

అయితే ఈమె ఇప్పుడు 66 ఏళ్ళ వయస్సులో గర్భం దాల్చింది అంటూ సోషల్ మీడియా లో ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. రీసెంట్ గానే రాజస్థాన్ లో ఎంతో గ్రాండ్ గా జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక జంట పెళ్ళికి హాజరైన నీనా గుప్త ని చూసి అందరూ ఒక్కసారి గా షాక్ కి గురయ్యారు. బాగా బొద్దుగా తయారై, బేబీ బంప్ తో ఉన్నట్లుగా ఆమె కనిపించింది. ఇదే ఇప్పుడు నేషనల్ లెవెల్ లో చర్చనీయాంశంగా మారింది. నీనా గత చైత్ర ని చూస్తే ఆమె ఇప్పుడు గర్భం దాల్చిన దాల్చొచ్చు, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే బెంగాల్ ప్రాంతానికి చెందిన నీనా గుప్తా , ఢిల్లీ లో పుట్టి పెరిగింది. 1982 వ సంవత్సరం లో ఈమె ‘సాథ్ సాథ్’ అనే మూవీ ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీ , ఒడియా , మలయాళం బాషలలో నటించింది.

కేవలం వెండితెర పై హీరోయిన్ గా నటించడమే కాకుండా, బుల్లితెర లో సీరియల్స్, పలు ఓటీటీ లలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఫుల్ బిజీ గా ఉండేది. ఇక ఈమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. తొలుత ఈమె ఆమ్లాన్ కుసుమ్ ఘోష్ ని పెళ్లాడింది. కొన్నాళ్ళు వీళ్ళ దాంపత్య జీవితం బాగానే కొనసాగింది కానీ, ఆ తర్వాత కొన్ని విబేధాలు వచ్చి విడిపోవాల్సి వచ్చింది. అనంతరం సారంగ్ దేవ్ పండిట్ తో ప్రేమాయణం నడిపిన ఈమె, కొన్నాళ్ళకు క్రికెట్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ తో కూడా ప్రేమాయణం నడిపింది. వీళ్ళతో బ్రేయాకప్ చేసుకున్న ఆమె , 2008 వ సంవత్సరం లో వివేక్ మెహ్రాన్ని పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించింది. ఇలా ఎన్నో వివాదాస్పద సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన నీనా గుప్త , ఇప్పుడు ఈ వయస్సు గర్భం దాల్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్వయంగా ఆమెనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version