Homeఎంటర్టైన్మెంట్Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత...

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో #NBK111 అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి సాగుతోంది. ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయం లో బాలయ్య కి చిన్న మసిల్ టియర్ జరిగిందట. దీంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు బాలయ్య పై పరీక్షలు నిర్వహించిన తర్వాత , ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారట.

ఈ సర్జరీ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ట్విటర్ ద్వారా తెలిపారు. ‘సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ , కష్టపడే తత్త్వం NBK111 టీం లో ప్రతీ ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. అభిమానులు బాలయ్య ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’ అంటూ గోపీచంద్ మలినేని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ‘జాగ్రత్తగా చూసుకోండి అన్నా మా హీరో ని’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నేటి తరం స్టార్ హీరోలు చిన్న పోరాట సన్నివేశాలకు డూప్స్ ని వాడుతున్నారు. అలాంటిది బాలయ్య ఈ వయస్సు లో కూడా యాక్షన్ సన్నివేశాల్లో రియల్ స్తంట్స్ చేస్తున్నారు , చూసి నేర్చుకోండి అంటరు సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే గోపీచంద్ మలినేని తో బాలయ్య కి ఇది రెండవ సినిమా. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వీర సింహా రెడ్డి’ కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలం తర్వాత వింటేజ్ బాలయ్య ని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చూపించడం తో నేటి తరం ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు. ఇకపోతే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా పూర్తిగా ‘ఓజీ’ తరహా యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. ఈ కొత్త యాంగిల్ లో గోపీచంద్ బాలయ్య ని ఎలా చూపించబోతున్నారో చూడాలి. ఈ ఏడాది లోనే షూటింగ్ పూర్తి చేసి విడుదల చెయ్యాలని చూస్తున్నారు. కానీ అనుకోకుండా బాలయ్య కి ఈ ప్రమాదం జరగడం తో షూటింగ్ కాస్త ఆలస్యం అవ్వొచ్చు , సంక్రాంతి కి విడుదల అవ్వొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version