ఎంటర్టైన్మెంట్నయనతార, విఘ్నేశ్‌కు కరోనా...?

నయనతార, విఘ్నేశ్‌కు కరోనా…?


కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సామాన్యులకే కాదు సెలబ్రిటీలను కూడా హడలెత్తిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు సినిమా రంగం బాగా దెబ్బతిన్నది. షూటింగ్స్‌ ఆగిపోవడంతో పలువురు ఉపాధి కోల్పోయారు. ఇంటి పట్టునే ఉన్నప్పటికీ పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకింది. ఈ వైరస్‌ వల్ల బాలీవుడ్‌లో కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా దక్షిణాది చిత్ర పరిశ్రమ పెద్దలు సైతం వైరస్‌ బారిన పడుతున్నారు. ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆయన తన ఇంట్లోనే ఉండి చికిత్స చేసుకుంటారు.

జగన్ టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు. ఆ రెండు పత్రికలు

మరోవైపు చెన్నైలో కోరలు చాస్తున్న కరోనా కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురికి సోకింది. లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు ప్రముఖ నిర్మాత విఘ్నేశ్‌ శివన్‌ కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు రావడం సంచలనం సృష్టించింది. కొన్ని కొత్త సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనుల కోసం శివన్‌ ఇటీవల కొంత మంది సాంకేతిక నిపుణులను కలిశాడు. ఆయన కలిసిన వ్యక్తుల్లో ఒకరికి కరోనా పాటిజివ్‌ అని తేలింది. దాంతో విఘ్నేశ్‌కు కూడా పరీక్ష నిర్వహించగా.. వైరస్‌ నిర్దారణ అయినట్టు వార్తలు వచ్చాయి. అతను.. నయన్‌ను తరచూ కలుస్తుంటారు కాబట్టి ఆమెకు కూడా కరోనా సోకిందని కోలీవుడ్‌లో తెగ ప్రచార జరిగింది. ఈ ప్రేమ జంట త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలు కూడా ప్రారంభించారు. . ఈ విషయం నయన్‌, శివన్‌ తెలియడంతో వాళ్లు స్పందించారు. తమకు కరోనా సోకలేదని, ఇవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేశారు. తాము సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామని పీఆర్ టీమ్‌ ద్వారా ప్రకటన ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

జగన్ నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా?

నయనతార –శివన్ ఓ గుళ్లో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. శివన్ ఇంట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా నయనతార కూడా పెళ్లి ప్రపోజల్ కి ఒప్పుకుంది అనే టాక్ నడిచింది. అయితే, రేపో మాపో పెళ్లి అనే వార్త హల్‌చల్‌ చేస్తుండగానే వాళ్లకు కరోనా వచ్చిందని పుకార్లు గుప్పుమనడం గమనార్హం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ ,సుకుమార్ మూవీలో లేడీ సూపర్ స్టార్.. రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేసిందంటే..

Ram Charan Sukumar Movie: 'పెద్ది' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ...

Tamil Nadu CM Vijay: డ్రైవర్ గా మారిన విజయ్.. సీఎం కుర్చీలో ఎవరిని కూర్చోబెడతారు..

Tamil Nadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రతిరోజు విజయ్ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నారు.. పరిపాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version