Natural Star Nani: ‘న్యాచురల్ స్టార్’ అనే బిరుదు ఇక నుంచి తనకు అవసరం లేదు అని, అలాగే అసలు హీరోలకు ఈ తోకలు ఎందుకని ? ఇలా నాని అనేక ప్రశ్నలను వేశాడు మీడియా సాక్షిగా. అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కూడా షాక్ అయి, ‘అరె.. నానిలో చాలా మార్పు వచ్చిందే’ అనుకుంటూ సంతోషంగా ఇంటర్వ్యూ మొదలు పెట్టారు. కానీ, ఇంటర్వ్యూ అయిపోయాక గాని, వాళ్లకు అసలు మ్యాటర్ అర్ధం కాలేదు. మారింది నాని కాదు, నాని డైలాగ్ మాత్రమే అని.

నాని ఇంటర్వ్యూ మధ్యలో తన గత సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన గత రెండు సినిమాలు ‘వి, టక్ జగదీష్’ సినిమాలు విజయాలు సాధించాయి అని నాని చెప్పుకొచ్చాడు. నిజానికి ఆ రెండు సినిమాలు పెద్ద డిజాస్టర్స్. ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచి బాగా విసిగించాయి. కాకపోతే, ఓటీటీలలో రిలీజ్ అయ్యాయి కాబట్టి, కలెక్షన్స్ గట్రా లెక్కలు ఏమి వాటికీ అవసరం లేకుండా పోయాయి.
Also Read: Actress in Instagram: ప్చ్.. అంతా బూతు మయం అంటున్న హీరోయిన్లు
సో.. ఒక సినిమా హిట్, ప్లాప్ అని డిసైడ్ చేసేది కలెక్షన్స్. ఎలాగూ తన సినిమాలకు కలెక్షన్స్ గొడవ లేదు కాబట్టి.. నాని సైలెంట్ గా ‘వి, టక్ జగదీష్’ సినిమాలు హిట్ అంటూ సినిమా జర్నలిస్ట్ ల దగ్గరే కబుర్లు చెప్పుకొచ్చాడు. ఏ సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి ? అసలు రాబోయే సినిమాకి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి ? అనే విషయాలను కూడా సీనియర్ సినీ పాత్రికేయులకు ఓ అంచనా ఉంటుంది.
అలాంటి వాళ్ళకే నాని గొప్పలు చెప్పుకుంటూ పోయాడు. పనిలో పనిగా తన రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అంటూ ప్రకటించుకున్నాడు. మాములుగా ప్రకటిస్తే ఏమి బాగుంటుంది ? అందుకే, తనకు తోచిన ఒక లెక్క చెప్పాడు. తన సినిమాల కారణంగా అమెజాన్ వారికి కొత్త సబ్స్క్రైబర్స్ పెరిగారట. అలాగే ఓటిటిలో రికార్డ్ స్థాయి నిముషాలలో తన సినిమాలను చూశారట.
పైగా తన ‘వి, టక్ జగదీష్’ సినిమాల నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయట. ఇలా అన్నీ లెక్క వేసుకుంటే తన ‘వి, టక్ జగదీష్’ రెండు సినిమాలు అఖండ విజయం సాధించాయనేది నాని అభిప్రాయం. మరి ఈ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ సాధించాయో సినిమాలు చూసిన సాధారణ ప్రేక్షకులకు కూడా తెలుసు. కాబట్టి.. కొత్తగా చెప్పేది ఏమి లేదు. అయితే, హీరోలకు తోకలు వద్దు అంటూనే నాని గొప్పలు పోతున్నాడు.