Nagarjuna Vs Samantha: సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో.. ? ఏది అబద్ధమో చెప్పలేని పరిస్థితి.. ప్రత్యర్థులను ఇరుకునపెట్టడానికి ఓ గాలి వార్తను సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే చాలు.. తన్నుకు చస్తుంటారు. వారి వ్యతిరేకులంతా కూడా షేర్లు చేస్తూ రచ్చ రంబోలా చేస్తుంటారు. అది నిజమా కాదా? అని ఏమాత్రం ఆలోచించరు. దాంతో పక్కోడికి ఎంత డ్యామేజ్ జరిగిందన్నది మాత్రమే ఆలోచిస్తారు.
ఇప్పుడు అలాంటి ఓ వార్తనే వైరల్ అవుతోంది. అదేంటంటే.. వైసీపీలో ఏ నేత పోటీలేకుండా ఖాళీగా ఉన్న ఎంపీ సీటు ఏదయ్యా అంటే అది ‘విజయవాడ’నే.. పోయిన ఎన్నికల్లో వైసీపీ తరుఫున ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పీవీపీ వైసీపీ తరుఫున పోటీచేసి ఓడిపోయాడు. ఇక్కడ టీడీపీ నుంచి నిలబడ్డ కేశినేని నాని ఎంపీగా గెలిచాడు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ఏపీ అమరావతి రాజధాని సీటును తన ఫ్రెండ్ , హీరో నాగార్జునకు ఇవ్వాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యాడని.. నాగార్జున కూడా రాజకీయాల్లోకి రావడానికి ఊవిళ్లూరుతున్నారని.. జగన్ విజయవాడ ఎంపీ సీటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఓ వార్త రెండు మూడు రోజులుగా హల్ చల్ చేస్తోంది. అది నిజమో కాదో కూడా ఇటు నాగార్జున కానీ.. అటు వైసీపీ శ్రేణులు కానీ ధ్రువీకరించలేదు. దీంతో వైరల్ అవుతోంది.
ఇప్పుడు మరో వైరల్ న్యూస్ దీనికి మించి ట్రెండ్ అవుతోంది. వైసీపీ తరుఫున మామ అక్కినేని నాగార్జున నిలబడితే.. జనసేన తరుపున ఆయన మాజీ కోడలు సమంత పోటీకి దిగబోతోందని.. తనను అన్యాయం చేసిన కుటుంబంపై ప్రతీకారానికే ఆమె పవన్ కళ్యాణ్ ను వేడుకొని విజయవాడ ఎంపీ సీటులో బరిలోకి దిగడానికి రెడీ అయినట్టు వార్త చక్కర్లు కొడుతోంది.
ఇప్పటివరకూ అక్కినేని ఇంట్లో జరిగిన పంచాయితీ.. ఇప్పుడు విజయవాడ గల్లీల్లో జరుగబోతోందని కొందరు ఈ వార్తను వైరల్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. మామ-కోడళ్లకు పోటీపెడుతూ రచ్చ చేస్తున్నారు. దీనిపై అటు నాగార్జున కానీ.. ఇటు సమంత కానీ స్పందించకపోయినా సరే ఈ సోషల్ మీడియా ఉద్యమకారులు ఓన్ చేసుకొని మరీ ట్రెండ్ చేస్తున్నారు.
మరి వీరిద్దరి మధ్యలో ఫాఫం నాగచైతన్య ఏం పాపం చేశాడు.. అతడికి కూడా టీడీపీ నుంచి ఎంపీ సీటు ఇచ్చి నిలబడితే ముగ్గురు కొట్టుకు చస్తారు.. కదా.. అక్కినేని వారికి పోటీ పెట్టి మనం ఎంజాయ్ చేయవచ్చు కదా?అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వైరల్ చేయడానికి కూడా ఓ అర్ధం ఉండాలని.. ఇలాంటి న్యూస్ ల విషయంలో వారి అభిప్రాయాలు తీసుకోవాలని కొందరు హితవు పలుకుతున్నారు.