Nagarjuna And Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతల తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకుంటున్న క్రమంలో సీనియర్ హీరోలు కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమవుతున్నారు. ఇక్కడే సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మన సీనియర్ హీరోలు సైతం వరుసగా విజయాలను సాధిస్తుంటడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలతో పెద్దగా సందడి చేయలేకపోయిన కూడా అతనికంటూ ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ అయి ఉంది. గతంలో ఆయన విభిన్న తరహా సినిమాలను ఎంచుకొని మరి సక్సెస్ లను సాధించాడు. ఇక గత సంవత్సరం కూలీ, కుబేర లాంటి సినిమాలతో కొంతవరకు డీలా పడిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం చాలా క్లారిటిని మైంటైన్ చేస్తున్నాడు.
తన వందో సినిమాతో మరోసారి మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దాంతో పాటుగా మరికొన్ని సినిమాలను సైతం పైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ గా పేరు సంపాదించుకున్న అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం రీసెంట్ టైమ్ లో ఆయనకి హార్రర్ జానర్ లో ఒక కథనైతే వినిపించాద
డట.
ఈ స్టోరీ నాగార్జునకి బీభత్సం గా నచ్చడంతో ఆ సినిమాని ఎలాగైనా సరే మనం చేద్దామని చెప్పినట్టుగా తెలుస్తుంది. నాగార్జున ప్రస్తుతం కొన్ని కమిట్మెంట్స్ తో ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన వందో సినిమా చేస్తున్నాడు. దాంతోపాటుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలతో ఆయన చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాలు అయిపోయిన తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి, వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా సైతం తొందర్లోనే రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారు…
