Naga Chaitanya – Samantha : నాగ చైతన్య-సమంత అధికారికంగా విడాకులు ప్రకటించి ఏడాదిన్నర అవుతుంది. 2021 అక్టోబర్ నెలలో సోషల్ మీడియా వేదికగా తమ సపరేషన్ గురించి తెలియజేశారు. అంతకు ముందే కొన్ని నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. 35 ఏళ్ల వయసులో విడిపోయిన ఈ జంట పెద్ద రిస్క్ చేశారు. కారణం… వారు వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. లేదంటే ఏజ్ బారైపోతుంది. పిలల్ని కనాలన్నా, వారి బాధ్యతలు చక్కగా నెరవేర్చాలన్నా సరైన వయసులో వివాహం చేసుకోవాలి.
ఇక సమంత, చైతు విడిపోయాక పలుమార్లు రెండో పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. అధికారిక సమాచారం మాత్రం రాలేదు. అయితే నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళ్లకు దగ్గరయ్యారనే ప్రచారం జరిగింది. తరచుగా కలుస్తున్న ఈ జంట రిలేషన్ లో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను నాగ చైతన్య టీమ్ ఖండించింది. ఎవరో కావాలని పుట్టిస్తున్న పుకార్లుగా అభివర్ణించారు. సమంత టీం చైతూ ఇమేజ్ దెబ్బతీయడానికి చేస్తున్నారనే వాదన కూడా వినిపించింది.
నిప్పు లేకుండా పొగరాదన్నట్లు శోభిత దూళిపాళ్లతో చైతు ఎఫైర్ నిజమే అంటూ కొన్ని ఫోటోలు ధృవీకరిస్తున్నాయి. హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ కి శోభిత-చైతు జంటగా వెళ్లారు. ఆ హోటల్ చెఫ్ చైతుతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో అనుకోకుండా కార్నర్ లో శోభిత కూడా క్యాప్చర్ అయ్యారు. దీంతో మరోసారి చైతు- శోభిత ఎఫైర్ తెరపైకి వచ్చింది.
హైదరాబాద్ లో కొత్త ఇంటి నిర్మాణం పూర్తి చేసిన నాగ చైతన్య ఇటీవల గృహ ప్రవేశం కూడా చేశారు. ఈ క్రమంలో నెక్స్ట్ పెళ్లే అంటున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రావచ్చంటున్నారు. దీంతో నాగ చైతన్య తోడు వెతుకున్నాడని, ఇక సమంత వంతు అంటున్నారు. ఆమె కూడా నచ్చిన వాడిని ఎంచుకుని పెళ్లి పీటలు ఎక్కితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సమంత ఇకపై పెళ్లి చేసుకోరని, పేరెంట్స్ ఎంతగా చెబుతున్నా వినడం లేదంటున్నారు. అదే సమయంలో సమంత మాయో సైటిస్ బారిన పడ్డారు. తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెబుతున్నారు. చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. కాబట్టి సమంతకు ప్రేమించే మూడ్, టైం ఉండకపోవచ్చు.