
ED – Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్‌గ్రూప్‌లో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, కల్వకుంట్ల వారసురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పటికే మూడుసార్లు ఈడీ విచారణకు హాజరైన కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. తాము కవిత అందించిన మొబైల్ ఫోన్లు తెరిచేందుకు సిద్దమయ్యామని లేఖలో తెలిపారు.
మీ ఎందుటే ఫోన్ల తెరుస్తాం..
కవిత అందించిన ఫోన్లను ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో ఈడీ పేర్కొంది. కవిత తరఫున ఈడీ కార్యాలయానికి బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ వెళ్లనున్నారు. ఈ కేసులో ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత మొబైల్‌ను మొదటిసారి విచారణకు వెళ్లినప్పుడే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ స్టేట్మెంట్, బిజినెస్‌కు సంబంధించిన కీలక పత్రాలను తన న్యాయవాది సోమా భరత్ ద్వారా ఈడీకి పంపారు. తరువాత రెండోరోజు కవిత విచారణకు హాజరైన క్రమంలో కొన్ని మొబైల్ ఫోన్స్ ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈడీ ఎదుట హాజరయ్యే ముందు మొబైల్ ఫోన్లను సీల్డ్ కవర్‌లో మీడియాకు చూపించారు.

ఆ మొబైల్స్‌లో ఏముందో..
నిజానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్‌గా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వగా.. ఆమె మూడుసార్లు హాజరయ్యారు. ఆమె ఈడీ విచారణకు హాజరైన ప్రతిసారీ.. కవితను అరెస్ట్ చేస్తారా లేకుంటే.. కవిత సేఫ్‌గా తిరిగి ఇంటికొస్తారా..? అనేదానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కవిత ఈడీకి సమర్పించిన మొబైల్స్ కొత్తవా..? లేకుంటే పాతవా..? అనే దానిపై కూడా చర్చ జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత ఫోన్ల చుట్టూనే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ జరుగుతోందని చెప్పుకోవచ్చు. మరి ఈడీ ఓపెన్ చేసే మొబైల్స్‌లో ఏముంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.