Mudra vs Disha Media Fight : ‘దిశ’కు పోటీగా.. జర్నలిస్టులంతా ‘ముద్ర’ వేస్తారట!

Mudra vs Disha Media Fight : చంద్రబాబుకు బాకా ఊదే ఆంధ్రజ్యోతి.. వైఎస్ఆర్ ను దేవుడిగా భావించే సాక్షి.. కేసీఆర్ జపం చేసే నమస్తే తెలంగాణ.. ఇక ఈనాడు రామోజీరావు ఏ ఎండకు ఆ గొడుగే.. ఇందులో పనిచేసే దిగ్గజ జర్నలిస్టులంతా తమకు ఇష్టం ఉన్నా.. లేకున్నా సరే ఆ మీడియా సంస్థకు.. దానివెనుకున్న పార్టీలకు.. వాళ్ల విధానాలకు కట్టుబడి రాయాల్సిందే.. బట్టలు చింపుకొని రాద్దామంటే పోస్ట్ ఊస్ట్ అవుతుంది. అయితే ఎన్నాళ్లీ మనసు చంపుకొని […]

Written By: NARESH, Updated On : January 27, 2023 6:23 pm
Follow us on

Mudra vs Disha Media Fight : చంద్రబాబుకు బాకా ఊదే ఆంధ్రజ్యోతి.. వైఎస్ఆర్ ను దేవుడిగా భావించే సాక్షి.. కేసీఆర్ జపం చేసే నమస్తే తెలంగాణ.. ఇక ఈనాడు రామోజీరావు ఏ ఎండకు ఆ గొడుగే.. ఇందులో పనిచేసే దిగ్గజ జర్నలిస్టులంతా తమకు ఇష్టం ఉన్నా.. లేకున్నా సరే ఆ మీడియా సంస్థకు.. దానివెనుకున్న పార్టీలకు.. వాళ్ల విధానాలకు కట్టుబడి రాయాల్సిందే.. బట్టలు చింపుకొని రాద్దామంటే పోస్ట్ ఊస్ట్ అవుతుంది. అయితే ఎన్నాళ్లీ మనసు చంపుకొని బతకడం.. ఎన్నాళ్లు యాజమాన్యం అడుగులకు మడుగులు ఒత్తడం అని అందరూ కంగారుపడ్డారు. చివరకు ఓ చల్లటి సాయంత్రం వేళ అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు.. అదే ‘ముద్ర’.

వారంతా దిగ్గజ జర్నలిస్టులు.. ఏదో ఒక అగ్ర దినపత్రికలో పనిచేస్తున్న వారే. పనిచేసి రిటైర్ అయినవారే. వాళ్లందరినీ కలిపేది ‘ఐజేయూ’. లేదంటే టీయూడబ్ల్యూజే. ఈ రెండూ జర్నలిస్ట్ సంఘాలే. పిచ్చాపాటిగా భేటి అయ్యే వీరంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ‘ఎన్నాళ్లీ పార్టీలకు అనుబంధ పత్రికల్లో, మీడియాలో పనిచేయాలి? మనమే సొంతంగా ఒక నిష్పక్షపాత మీడియాను పెడితే బాగుంటుంది కదా? అని ఆలోచించారు. అనుకుందే తడువుగా మనిషికి ఓ 5 లక్షలను తాహతును బట్టి వేసుకున్నారు. ఇందులో తెలుగులో పలు పత్రికలు, మీడియాలో పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. అలా ఓ 50 లక్షలు జమ చేసి ‘ముద్ర’ వేయాలని చూస్తున్నారు. అయితే వీరి సంకల్పానికి బలం ఇచ్చింది.. బూస్ట్ లా పనిచేసింది ‘దిశ’నే. అందుకే ఆ మీడియాలో ఉన్న టాప్ జర్నలిస్టును కూడా లాగేసి ఇప్పుడు ‘ముద్ర’ పేరు తో కొత్త వెబ్ మీడియా/ఆన్ లైన్ పత్రికను ప్రారంభించేశారు. ఆ ముద్ర తెలుగు రాజకీయాల్లో ఎంతటి ముద్ర వేస్తుందన్నది వేచిచూడాలి.

నిజానికి ఐజేయూలోని ఈ జర్నలిస్టులంతా ఇలా ధైర్యంగా ముందడుగు వేయడానికి కారణం ‘దిశ’ పత్రికనే. నమస్తే తెలంగాణ నుంచి కేసీఆర్ ఆగ్రహానికి గురై బలవంతంగా రాజీనామా చేసిన ఒక ఎడిటర్ స్థాయి వ్యక్తి కొందరితో కలిసి కరోనా టైంలో ప్రారంభించిందే ‘దిశ’ మీడియా. ఆయనే ఎడిటర్ గా ముందుగా పత్రిక అనుకున్నారు. కానీ జిల్లాకు ఒక ఎడిషన్ పత్రిక కాస్ట్ పెరుగుతుందని ఆన్ లైన్ బాట పట్టారు. వెబ్ సైట్ తోపాటు ఆన్ లైన్ ఎడిషన్ పత్రికను లాంఛ్ చేశారు. ఇది రెండుమూడేళ్లలోనే కోతకు వచ్చింది. అందరికీ చేరువై హిట్ అయ్యింది. ఒకనొక దశలో ఆంధ్రజ్యోతి, ఈనాడుతోపాటు ర్యాంకింగ్ పొందింది.

దీంతో నమ్మకం కుదిరిన జర్నలిస్టులంతా ‘దిశ’ను పోలిన ‘ముద్ర’ను వేయాలని తపించారు. మనిషికి 5 లక్షలు, ఇంకొందరు ఎంత ఉంటే అంతా వేసుకొని ‘ముద్ర’ పేరుతో అచ్చం దిశ లాంటి వెబ్ సైట్/ఆన్ లైన్ పత్రికను ప్రారంభించారు. దిశలో పలువురు దిగ్గజ జర్నలిస్టులను ఇందులోకి లాగారు. తమ పరిచయాలు ఉపయోగించుకొని ఐజేయీలో యాక్టివ్ గా ఉండే సీనియర్లు అంతా ఇందులో చేరారు. నమస్తే తెలంగాణకు ఎడిటర్ గా చేసిన సీనియర్ జర్నలిస్టులను ఈ ముద్రకు ఎడిటర్ గా చేశారు. దిశ సహా వివిధ పత్రికల్లో ఉన్న మంచి జర్నలిస్టులను ముద్రలోకి లాగేసి పోస్టింగులు ఇచ్చారు.

అలా అందరూ కలిసి ఏ పార్టీకి వంతపాడకుండా.. ఏ అలిగేషన్స్ లేకుండా స్వతంత్ర మీడియాగా వద్దామని మనిషికి కొన్ని పైసలు వేసుకొని బయలుదేరారు. మరి వీరి ప్రయత్నం ‘దిశ’లా గమ్యం చేరుతుందా? ఏ ‘ముద్ర’లేకుండా పోతుందా? అన్నది వారి శక్తి సామర్థ్యాలను బట్టి తేలుతుంది.