Homeఎంటర్టైన్మెంట్BVS Ravi on Mohan Babu: మోహన్ బాబు అందరినీ తిడతాడు అంటారు కానీ నాకు...

BVS Ravi on Mohan Babu: మోహన్ బాబు అందరినీ తిడతాడు అంటారు కానీ నాకు లైఫ్ ఇచ్చాడు అంటున్న స్టార్ డైరెక్టర్..

BVS Ravi on Mohan Babu: సినిమా ఇండస్ట్రీ లో కలెక్షన్ కింగ్ గా గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు… ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు గొప్ప విజయాలను సాధించాయి. కెరియర్ స్టార్టింగ్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఆయన హీరోగా అవతరించి భారీ విజయాలను సాధించాడు. తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. ఆయన గత కొద్దిరోజులుగా ఖాళీగానే ఉంటున్నాడు. తన కొడుకుల సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశాడు. శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక దాంతో పాటుగా అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో కూడా మోహన్ బాబు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ రెండు పాత్రలతో ఆయన మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే మోహన్ బాబు పేరు చెప్తే చాలు చాలామంది అతనికి చాలా కోపం ఉంటుది.

చాలామందిని తిడతాడు, కొడతాడు అంటూ చాలా రకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మోహన్ బాబు మాత్రం పైకి కనిపించేంత కఠినమైన వ్యక్తి కాదని ఆయన చాలా మంచి వ్యక్తి అంటూ రైటర్ అండ్ డైరెక్టర్ అయిన బీవీఎస్ రవి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

తను గోపీచంద్ ను హీరోగా పెట్టి చేసిన ‘వాంటెడ్’ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మోహన్ బాబు రవి ఇంటికి ఒక పెద్ద పండ్ల బుట్ట తో పాటు 5 లక్షల రూపాయలతో ఉన్న ఒక చెక్కును కూడా గిఫ్ట్ గా పంపించారట. ఆ చెక్కును తీసుకొని తన కొడుకుకి ఒక మంచి కథ రాయమని సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

‘దేనికైనా రెడీ’ అనే కథను రెడీ చేశారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వీళ్ళందరికి మంచి గుర్తింపైతే వచ్చింది. మొత్తానికైతే మోహన్ బాబును అందరు విలన్ గా చూస్తారు. కానీ అతను నిజంగా హీరోనే అంటూ బివిఎస్ రవి తనను మోహన్ బాబు ఎలా ఆదుకున్నాడు అనే విషయాలను గుర్తు చేసుకున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular