Pawan Kalyan : సౌత్ ఇండియా లో నేటి తరం స్టార్ హీరోలలో అభిమానులు దేవుడి లాగ కొలవబడేంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే మన తెలుగులో నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే తమిళం నుండి ఇలయథలపతి విజయ్ పేర్లు వినిపిస్తాయి. హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈ ఇద్దరు హీరోలను అభిమానులు ఆరాధ్య దైవంగా భావిస్తారు. వీళ్ళ సినిమాలు విడుదలైతే చాలు, టాక్ తో అసలు సంబంధమే లేకుండా బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తాయి.
అలాంటి స్టార్ స్టేటస్ కోసం మన స్టార్ హీరోలు తపస్సు చేస్తుంటారు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వీళ్లిద్దరికీ అలాంటి ఇమేజి దక్కింది. అంతే కాదు, వీళ్లిద్దరు ఒకరినొకరు వ్యక్తిగతం గా ఎంతో అభిమానించుకుంటారు కూడా. విజయ్ పవన్ కళ్యాణ్ కి అతి పెద్ద వీరాభిమాని. ఈ విషయాన్నీ వీళ్ళిద్దరితో సినిమాలు చేసిన ప్రముఖ దర్శకుడు అరుణ్ ప్రసాద్ స్వయంగా తెలిపాడు.
ఇది ఇలా ఉండగా వీళ్లిద్దరు మధ్య మంచి స్నేహం ఉండడం తో గతం లో ఎస్ జె సూర్య గతం లో ఒక మల్టిస్టార్రర్ చిత్రం చేద్దాం అనుకున్నాడు. ఈ ఇద్దరు హీరోలు కూడా ఒప్పుకున్నారు, కానీ అదే సమయం లో పవన్ కళ్యాణ్ – ఎస్ జె సూర్య కాంబినేషన్ లో కొమరం పులి అనే చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఇక అప్పటి నుండి ఎసిజి సూర్య సినిమాలకు దర్శకత్వం వహించడం ఆపేసాడు.
దాంతో ఈ క్రేజీ మల్టిస్టార్రర్ అట్టకెక్కింది. భవిష్యత్తులో వీళ్లిద్దరు కలిసి నటించే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే విజయ్ ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల తర్వాత శాశ్వతంగా నటనకి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాడు, కాబట్టి వీరి కాంబినేషన్ లో ఇక సినిమా వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు విశ్లేషకులు.