https://oktelugu.com/

Varun – Lavanya : లుక్ మొత్తం మార్చేసింది.. మెగా ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి ఎయిర్ పోర్టులో వీడియో వైరల్

హైదరాబాద్ వేదికగా నాగబాబు నివాసంలో వరుణ్-లావణ్య ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరిగింది.

Written By: , Updated On : October 28, 2023 / 11:22 AM IST
Follow us on

Varun – Lavanya : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా లావణ్య-వరుణ్ జంటగా ఇటలీకి పయనమయ్యారు. 2017లో మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్ గా నటించారు. అప్పుడే వీరి ప్రేమకు బీజం పడింది. అనంతరం మరి కొన్ని చిత్రాల్లో జతకట్టారు. వీరి ప్రేమ వ్యవహారం ఏళ్ల పాటు రహస్యంగా ఉంది. రెండేళ్ల క్రితం బయటకు పొక్కింది. వరుణ్ తేజ్ లావణ్యను పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.

అయితే ఈ వార్తలను లావణ్య త్రిపాఠి ఖండించడం విశేషం. అయితే ఎక్కడో అనుమానాలు మాత్రం ఉన్నాయి. సడన్ గా జూన్ 9వ తేదీన నిశ్చితార్థం ప్రకటించారు. హైదరాబాద్ వేదికగా నాగబాబు నివాసంలో వరుణ్-లావణ్య ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ సతీసమేతంగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, ధరమ్ తేజ్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు.

చిరంజీవి ఇటీవల గ్రాండ్ బ్యాచ్లర్ పార్టీ ఇచ్చారు. అనంతరం అల్లు అర్జున్ తన నివాసంలో మరో పార్టీ వరుణ్-లావణ్యల కోసం ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం పెళ్లిపై హింట్ ఇచ్చాడు వరుణ్. నవంబర్ 1న పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. పెళ్ళికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే ఆహ్వానం అని తెలుస్తుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రామ్ చరణ్-ఉపాసన కూతురు క్లిన్ కారను తీసుకుని ఇటలీ వెళ్లారు.

మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. తాజాగా కొత్త జంట సైతం పయనమయ్యారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో లావణ్యతో పాటు వరుణ్ కనిపించారు. పెళ్లికి కేవలం మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా అక్కడికి చేరుకుంటున్నారు. పెళ్లి అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఆ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారట. ఇక వరుణ్, లావణ్యలకు అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.