Car Engine Power: కారు ఇంజిన్ పవర్ పెంచాలనుకుంటున్నారా? అంతకుముందు ఈ పని చేయాలి..

కారు ఉండగానే సరిపోదు. దానికి సరైన మెయింటనెన్స్ ఉండాలి. కారుకు సంబంధించిన అన్నీ పత్రాలను సరిగ్గా చూసుకోవాలి. బైక్ కు ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకోవడంలో వెనుకాడుతారు.

Written By: Srinivas, Updated On : October 28, 2023 6:22 pm

Car Engine Power

Follow us on

Car Engine Power: కారు కొనుక్కోవాలని చాలా మందికి ఉంటుంది. సొంత కారులో షికారుకెళ్లే ఆ హాయి వేరే ఉంటుంది. ఒకప్పుడు ఖరీదైన ఇళ్లల్లో మాత్రమే కారు ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి వివిధ మోడళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఏదైనా కారు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను ప్రత్యేకంగా తెలుసుకోవాలి. లేకుంటే చిక్కుల్లో పడుతారు. ముఖ్యంగా కారు ఎక్కువ స్పీడు కోసం హార్స్ పవర్ పెంచమని కోరుతారు. కానీ ఈ హార్స్ పవర్ పెంచే ముందు మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే?

కారు ఉండగానే సరిపోదు. దానికి సరైన మెయింటనెన్స్ ఉండాలి. కారుకు సంబంధించిన అన్నీ పత్రాలను సరిగ్గా చూసుకోవాలి. బైక్ కు ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకోవడంలో వెనుకాడుతారు. కానీ కారుకు కచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకుంటే కారులో సుదూర ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నో రిస్క్ లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రిస్క్ ల నుంచి బయటపడాలంటే ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలి.

అయితే చాలా మంది కారును కొనుగోలు చేసేటప్పుడు ఆకర్షణీయమైన డిజైన్ తోపాటు ధర చూస్తారు. ఇదే సమయంలో ఇంజిన్ పవర్ గురించి తెలుసుకుంటారు. ఏదైనా కారు కొనాలనుకుంటే దానికి సంబంధించిన ఇంజిన్ పవర్ పెంచాలని కోరుతారు. ఇంజిన్ హార్స్ పవర్ పెంచడం వల్ల మిగతా వాటికంటే స్పీడుగా వెళ్తుంది. అలాగే నైట్రోస్ ను కూడా ఇన్ స్టాల్ చేయమని అడుతారు.

కార్లను విక్రయించేవారు ఇన్సూరెన్స్ గురించి పెద్దగా వివరించే ఆస్కారం ఉండదు. ఈ తరుణంలో కారు కొనాలనుకునేవారు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే కారు హార్స్ పవర్ పెంచినప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా మారుతుంది. ఈ క్రమంలో ముందుగానే ఇన్సూరెన్స్ కార్యాలయంలో సంప్రదించి హార్స్ పవర్ పెంచే విషయాన్ని వెల్లడించాలి. దీంతో వారు ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి చెబుతారు. వారు ఒప్పుకొని, పెరిగిన ప్రీమియంను చెల్లించే స్తోమత ఉన్నప్పుడే హార్స్ పవర్ పెంచుకోవాలి.