spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ బాబు చేసిన ఈ రెండు తప్పులు ఆయన్ని నెంబర్ వన్ కాకుండా...

Mahesh Babu: మహేష్ బాబు చేసిన ఈ రెండు తప్పులు ఆయన్ని నెంబర్ వన్ కాకుండా ఆపేశాయా…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. ఒక్కడు సినిమాతో మొదటి మాస్ హిట్ ను సంపాదించుకున్న ఆయన పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడ. ఇకు అదే సమయంలో ఆయన యంగ్ హీరోలందరిలో నెంబర్ వన్ హీరోగా మారిపోతాడు అంటూ చాలా రకాల వార్తలైతే వచ్చాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ మిగతా హీరోలు సైతం ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలు చేసుకుంటూ వచ్చారు. దానివల్ల ఆయన కొంతవరకు డౌన్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది… నిజానికి మహేష్ బాబు నెంబర్ వన్ హీరో అయ్యేవాడు. కానీ ఆయన చేసిన రెండు తప్పుల వల్లే ఆయన ఇప్పటికీ నెంబర్ వన్ హీరోగా నిలబడలేక పోతున్నాడు అని చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ రెండు కారణాలు ఏంటి అంటే ఆయన స్టోరీ సెలక్షన్స్ లో అంత పెద్దగా ఎఫెక్టివ్ గా పాల్గొనలేదు.

ఎప్పుడూ ఒకే తరహా సినిమాలను చేస్తూ సేఫ్ జోన్ లో ఉండడానికి ప్రయత్నం చేశాడు తప్ప డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. సుకుమార్ దర్శకత్వంలో ‘వన్ నేనొక్కడినే’ సినిమా చేసినప్పటికి అది ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన మరోసారి ఎక్స్పరిమెంట్ జోలికి అయితే వెళ్లలేదు…

ఇక అలాగే ఆయన ఎప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు తప్ప తన తోటి హీరోలందరు పాన్ బాట పడుతుంటే ఆయన మాత్రం పాన్ ఇండియా సినిమాలను చేసే అవకాశం లేకుండా కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమయ్యాడు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ పాన్ ఇండియా సినిమా చేసినట్లయితే ఆయన ఇప్పటివరకు నెంబర్ వన్ హీరోగానే కొనసాగుతూ ఉండేవాడు.

ఈ రెండు కారణాలవల్లే ఆయన ఇప్పటివరకు నెంబర్ వన్ హీరోగా మారలేకపోయాడు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఫ్యూచర్లో అయినా ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రి లో నెంబర్ వన్ హీరోగా మారుతాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version