spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu And Namrata: మహేష్ బాబు విషయంలో రాంగ్ స్టెప్ వేసిన నమ్రత... సూపర్...

Mahesh Babu And Namrata: మహేష్ బాబు విషయంలో రాంగ్ స్టెప్ వేసిన నమ్రత… సూపర్ స్టార్ రియాక్షన్ ఇదీ..?

Mahesh Babu And Namrata: సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నటుడు మహేష్ బాబు… కెరియర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ సినిమాలను చేసిన ఆయన ప్రస్తుతం కమర్షియల్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నాడు. ‘పోకిరి’ సినిమాతో మొదటిసారి ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న ఆయన ఆ తర్వాత వరుస విజయాలతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనువైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు ఏ సినిమా చేయాలన్నా కూడా ముందు ఆ సినిమా కథని తన భార్య అయిన నమ్రత వింటారు ఆమె స్టోరీ ఫైనల్ చేస్తుంది. ఒకసారి నమ్రత ఎదజన కథను రిజెక్ట్ చేస్తే మహేష్ బాబు ఆ సినిమాని చేయడు. ఆమె ఓకే అంటేనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు విషయంలో నమ్రత ఒక రాంగ్ స్టెప్ వేసిందంటూ చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తుంటారు. నిజానికి సందీప్ రెడ్డివంగ మొదట ‘అనిమల్’ సినిమా కథని మహేష్ బాబుకి వినిపించాడు. కానీ అందులో కొన్ని బోల్డ్ సీన్స్ ఉండడం వల్ల నమ్రత వద్దని చెప్పిందట… కానీ ఆ మూవీ మహేష్ బాబు చేసి ఉంటే నెక్స్ట్ లెవల్లో ఉండేదని అతని అభిమానులైతే అభిప్రాయపడుతున్నారు. నిజానికి సందీప్ రెడ్డివంగ అనిమల్ సినిమా కథని మహేష్ బాబు తో చేయాలని అనుకోలేదు. ఆయనకి చెప్పింది వేరే కథ చెబుతున్నాడు. కానీ మొత్తానికైతే మొదట అనిమల్ సినిమా కథ చెప్పిన తర్వాత అది నచ్చకపోతే మరో సినిమా కథని వినిపించారట. అది కూడా మహేష్ బాబుకి చాలా వైలెన్స్ తో కూడుకున్న పాత్రలా అనిపించడం తో ఆయన కథను రిజెక్ట్ చేశారట. మొత్తానికైతే మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించకుండా నమ్రత అడ్డుగా నిలబడిపోయిందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాధవీలత దుర్గా స్తుతి.. వీడియో వైరల్

ఇక ఏది ఏమైనా కూడా మహేష్ ఒక్కసారైనా సందీప్ వంగ దర్శకత్వంలో పనిచేస్తే మహేష్ బాబు లోని నట పోటెన్షయాలిటీ బయటికి తీయాగలిగే కెపాసిటి తన దగ్గర ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్ సెట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

నిజానికి మహేష్ బాబు చాలా మంచి నటుడు నిజం, వన్ నేనొక్కడినే సినిమాలను మినహాయిస్తే ఆయన నటన పెద్దగా ఎలివేట్ అయిందైతే లేదు. సందీప్ సినిమాలో ఒక ఎమోషన్ తో పాటు ఒక క్రూయల్టీ కూడా ఉంటుంది. కాబట్టి మహేష్ బాబుని అంత క్రూయల్ గా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

మిల్క్ బాయ్ లా ఉండే మహేష్ బాబు అంత క్రూయాల్ గా ఉండే పాత్ర ను ఎలా పోషిస్తాడు అనేది అనేది చూడటానికి చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇక నటుడికి పెను సవాళ్లు ఎదురైనప్పుడే ఆ నటుడి యొక్క పూర్తిస్థాయి నటన బయటికి వస్తుంది. కాబట్టి మహేష్ బాబు సైతం అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందని తన అభిమానులు అభిప్రాయపడుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular