Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Namrata Relationship: మహేష్ బాబు నమ్రత ఇన్ని సంవత్సరాలైన కలిసి మెలిసి ఉండటానికి...

Mahesh Babu Namrata Relationship: మహేష్ బాబు నమ్రత ఇన్ని సంవత్సరాలైన కలిసి మెలిసి ఉండటానికి కారణం ఇదే…

Mahesh Babu Namrata Relationship: ఒక్కపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఎవ్వరు పట్టించుకునేవారు కాదు…కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే తెలుగు సినిమాలు టార్చ్ బేరర్ గా మారిపోయాయి… మన స్టార్ హీరోలు సైతం వైవిద్య భరితమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం మొన్నటి వరకు తెలుగుకే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నిజానికి పాన్ ఇండియాలో సైతం పెద్దగా మార్కెట్ లేని మహేష్ బాబును పాన్ వరల్డ్ లోకి తీసుకెళ్తున్న ఘనత రాజమౌళికే దక్కింది…మహేష్ బాబు ఏ సినిమా చేయాలన్నా కూడా తన భార్య అయిన నమ్రతనే కథలను విని అది మహేష్ బాబుకి సెట్ అవుతుందా? లేదా అనే విషయాలను పరిశీలించిన తర్వాత ఆ కథ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మహేష్ బాబు నమ్రతల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ఇద్దరు కలిసిమెలిసి జీవిస్తున్నారు. దానికి గల కారణం ఏంటి అంటూ చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకొని అలా విడిపోతున్నారు. కానీ వీళ్లు మాత్రం రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య బాండింగ్ ఇంకా బలంగా మారుతుంది తప్ప వీక్ అవ్వడం లేదు. ఎందుకని వాళ్ళు అంత స్ట్రాంగ్ గా కలిసి మెలిసి బతుకుతున్నారు.

దానికి గల కారణాలను కూడా కొంతమందికి చెబితే విడిపోయే జంట కూడా కలిసే అవకాశాలు ఉంటాయి కదా అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికైతే వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరి నిర్ణయాలకు మరొకరు గౌరవాన్ని ఇస్తూ ఒక విషయాన్ని ఇద్దరు కలిసి చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారట.

అందువల్లే వీళ్ళ మధ్య ఎలాంటి గొడవలు రావడం లేదట… అందువల్లే వీళ్ళ మధ్య బాండింగ్ బాగా కుదిరింది. అందరు అలానే ఉంటే ఎవ్వరి మధ్య విభేదాలు రావు. ఎవ్వరు విడిపోరు అంటూ చాలామంది వీళ్లను ఉదాహరణగా తీసుకొని విడిపోయే జంటలకు సలహాలనైతే ఇస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version