Homeక్రైమ్‌Karimnagar Jewellery Robbery: కరీంనగర్ టు మహారాష్ట్ర.. వయా ధర్మపురి.. బంగారం దొంగలు తప్పించుకున్న...

Karimnagar Jewellery Robbery: కరీంనగర్ టు మహారాష్ట్ర.. వయా ధర్మపురి.. బంగారం దొంగలు తప్పించుకున్న రూట్ దొరికింది

Karimnagar Jewellery Robbery: తెలంగాణలోని కరీంనగర్ నగర నడిబొడ్డున పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన సాయుధ దోపిడీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పట్టపగలే ఐదుగురు దుండగులు తుపాకులతో షోరూమ్‌లోకి చొరబడి, సిబ్బందిని తుపాకులతో బెదిరించి కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది గాయపడగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

దొంగల కోసం గాలింపు..
దోపిడీకి పాల్పడిన దొంగల కోసం పోలీసులు 20 బృందాలుగా గాలిస్తున్నారు. ఇప్పటికే దొంగలు రాష్ట్రం దాటినట్లు పోలీసులు గుర్తించారు. వారు ఏమార్గంలో ప్రయాణించారో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. నిందితులు పరారైన పల్సర్ బైక్‌ను ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో పోలీసులు గుర్తించారు. బైక్‌తోపాటు సమీపంలోనే హెల్మెట్‌ను కూడా వదిలివెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్న పోలీసులు, గోదావరి తీర ప్రాంత గ్రామాలతో పాటు అటవీ పరిసరాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మహారాష్ట్రకు పరార్‌..
పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తాజాగా ధర్మపురి పుష్కర ఘాట్ వద్ద దోపిడీకి ఉపయోగించిన పల్సర్ బైక్ మరియు హెల్మెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాల ద్వారా దుండగుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. నిందితులు సారంగాపూర్ మండలం బీర్‌పూర్ గోదావరి మార్గం మీదుగా మహారాష్ట్రకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ముమ్మరంగా తనిఖీలు
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పర్యవేక్షణలో బీర్‌పూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని స్థానికులు, వ్యాపారవేత్తలు కోరుతున్నారు. నిందితుల గాలింపు కోసం స

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper
Exit mobile version