Mahesh Babu Reaction To Peddi: మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్…అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ ఇండియాలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక పెద్ది సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను సగటు ప్రేక్షకులతో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా చూశారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాని చూసి అద్భుతంగా ఉంది అంటూ రామ్ చరణ్ కి ఫోన్ చేసి మాట్లాడట. ఇక తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కూడా చాలా బాగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కుస్తీ ఫైట్లో తన బాడీ అద్భుతంగా ఉందని అంత బాడీని బిల్డ్ చేయడమంటే మామూలు విషయం కాదని అందులో నువ్వు చాలా వరకు సక్సెస్ అయ్యావు అంటూ రామ్ చరణ్ ను పొగిడినట్టుగా తెలుస్తుంది.
నటన కూడా అద్భుతంగా ఉందని చెప్పాడట. క్లైమాక్స్ లో నిజంగా ఏడిపించేసావు చరణ్ అంటూ మహేష్ బాబు ఒక 30 నిమిషాల పాటు సినిమా గురించి మాట్లాడినట్టుగా ఫిలిం నగర్ సర్కిల్ లో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు రామ్ చరణ్ తో ఎప్పుడు సన్నిహితంగానే ఉంటాడు. వీళ్లిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది. ఒక సినిమా గురించి మరొకరు డిస్కస్ చేసుకునే అంత క్లోజ్ నెస్ కూడా ఉండటం వల్లే మహేష్ బాబు ఈ సినిమాని మొదటి రోజే చూసి అతనికి కాల్ చేసి చెప్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…
ఓవరాల్ గా ఈ సినిమా సగటు ప్రేక్షకులను మెపిస్తూ ముందుకు సాగుతుంది. మరి ఫైనల్ గా ఈ సినిమా మంచి రిజల్ట్ ను రాబడుతోంది. అలాగే ఈ మూవీ లాంగ్ రన్ లో భారీ రికార్డులను కొల్లగొట్టే విధంగా కలెక్షన్స్ ని రాబడుతుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
