spot_img
Homeఎంటర్టైన్మెంట్Mad For Each Other Reality Show Controversy: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' షో...

Mad For Each Other Reality Show Controversy: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో వల్ల ఆ జంట విడిపోయిందా..? ఇదేమి రియాలిటీ షో బాబోయ్!

Mad For Each Other Reality Show Controversy: రేపటి నుండి స్టార్ మా , జియో హాట్ స్టార్ లో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్'(Mad For Each Other) రియాలిటీ షో గ్రాండ్ గా మొదలు కాబోతుంది. పది మంది జంటలు , ఒక లగ్జరీ వీల్లలోకి అడుగుపెట్టి, 70 రోజుల పాటు తమ మధ్య ఉన్న ప్రేమానుబంధం గురించి అనేక పరీక్షలు ఎదురుకొని, చివరిగా విజేతలుగా నిల్చిన వారు 50 లక్షల ప్రైజ్ మనీ తో బయటకు వస్తారు. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కి సంబంధించిన షూటింగ్ మొదలై మూడు వారాలు పూర్తి అయ్యింది. ఈ మూడు వారాల్లో ఇప్పటి హరిత – హరీష్, మహేష్ బాబు – సాండ్రా, సంధ్య – బీట్రూ జంటలు ఎలిమినేట్ అయిపోయాయి. ఇక వీళ్ళలో కేవలం 7 జంటలు మాత్రమే మిగిలాయి. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది చూడాలి.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!

ఇదంతా పక్కన పెడితే ఈ షో పూర్తి అయ్యే లోపు కచ్చితంగా ఎదో ఒక జంట విడిపోతుందేమో అని రేంజ్ లో కొన్ని గొడవలు జరిగాయట. ఉదాహరణకు నూక రాజు – ఆసియా జంట మధ్య ఈమధ్యనే ఒక పెద్ద గొడవ జరిగిందట. చాలా రోజులు మాట్లాడుకోకుండా ఉన్నారట. ఇలా ఉన్నారేంటి , విడిపోతారా ఏంటి? అని ప్రేక్షకులు భయపడే రేంజ్ లో వీళ్ళ మధ్య గొడవలు జరిగాయట. కానీ రీసెంట్ గానే వీళ్లిద్దరు మళ్లీ కలిసిపోయారని తెలుస్తోంది. అదే విధంగా మొదటి నుండి ఎంతో అన్యోయంగా మెలుగుతూ వచ్చిన వాసంతి కృష్ణన్ – పవన్ కళ్యాణ్ , ప్రియాంక జైన్ – శివ జంటల మధ్య కూడా విబేధాలు ఏర్పడ్డాయట. కానీ మళ్లీ ఎదో ఒక టాస్కు ని నిర్వహించి వీళ్ళని కలిపేశారట. ఇలా అడుగుగడుగునా జంటల మధ్య ఉన్న ప్రేమని టెస్ట్ చేస్తూ ఈ షో సాగుతుందట. ఈ కారణం చేత జంటల మధ్య విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నారు.

హిందీ లో కూడా ఇలాంటి షో ని నిర్వహించారు. ఒక నాలుగు సీజన్స్ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయింది. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా బ్లాస్టింగ్ రేంజ్ లో వచ్చాయి. కానీ 5 వ సీజన్ లో పెద్ద గొడవలు జరిగి, కోర్టు మెట్లు ఎక్కేవరకు వచ్చింది. దీంతో ఆ షోని ఆపేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఈ షో లో కూడా రాబోతోందా అనేది చూడాలి. ఇకపోతే మొదటి నాలుగు వారాలు కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఎలిమినేషన్స్ లీడర్ బోర్డు లో వచ్చిన మార్క్స్ ఆధారంగా జరుగుతుందట. కానీ 5 వ వారం నుండి ప్రేక్షకుల ఓటింగ్ తో పాటు, లీడర్ బోర్డు లో వచ్చిన మార్కులను కూడా కలుపుకొని చూసి ఎలిమినేషన్స్ ఉంటుందట. ఈ షోకి యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తుండగా, అనిల్ రావిపూడి, లయ మరియు సీనియర్ హీరోయిన్ రాధ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version