Maa Inti Bangaram 5 Days Collections: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. సాధారణంగా ఇలాంటి సినిమాలు వీకెండ్ తర్వాత బాగా డౌన్ అయిపోతుంటాయి , కానీ ‘మా ఇంటి బంగారం’ మాత్రం వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని రాబడుతుండడం విశేషం. ‘పెద్ది’ చిత్రానికి రీసెంట్ గా ఇలాంటి రన్ చూశాము . మళ్లీ ఇలాంటి రన్ ఎప్పుడు చూస్తామో అని అనుకున్న ఆడియన్స్ కి ‘మా ఇంటి బంగారం’ చిత్రం మరో సమాధానం గా నిల్చింది. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, టాలీవుడ్ కి గోల్డెన్ డేస్ మొదలయ్యాయి అని. 4 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 77 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి , 5 వ రోజున 1 కోటి 49 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రం ఏకంగా 7 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతుందని అంచనా. అంటే పెట్టిన ప్రతి పైసాకు పదింతలు లాభాలు అన్నమాట. ఈ స్థాయిలో ఒక సినిమాకు నైజాం ప్రాంతం లాభాలు రావడం చూసి చాలా రోజులైందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాల విషయానికి వస్తే, 5 రోజుల్లో ఈ ప్రాంతాల నుండి ఈ చిత్రానికి 5 కోట్ల 66 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 25 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.
అదే విధంగా తమిళనాడు నుండి 1 కోటి 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ నుండి ఏకంగా 7 కోట్ల 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల 66 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 50 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 12 కోట్ల రూపాయిలు మాత్రమే, 5 రోజుల్లోనే రెండింతల లాభాలు వచ్చాయి , ఇక ఫుల్ రన్ లో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేసి , ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
