KTR vs Revanth Reddy: కేటీఆర్ ఎక్కడున్నారు? నిజంగానే దుబాయ్ కు వెళ్లారా?
Ktr vs Revanth Reddy: రాష్ట్రంలో తాజాగా చాలా పరిణామాలో చోటుచేసుకున్నాయి. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు మీద తీన్మార్ మల్లన్న చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. మంత్రి మాత్రం లైవ్ లోకి రాకుండా కేవలం ట్వీట్ లతోనే రియాక్ట్ అవుతున్నారు. మరో వైపు కేంద్రం వడ్ల కొనుగోలు విషయంపై చర్చించేందుకు టీఆర్ఎస్ మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసేందుకు వెళ్లింది. […]
Ktr vs Revanth Reddy: రాష్ట్రంలో తాజాగా చాలా పరిణామాలో చోటుచేసుకున్నాయి. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు మీద తీన్మార్ మల్లన్న చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. మంత్రి మాత్రం లైవ్ లోకి రాకుండా కేవలం ట్వీట్ లతోనే రియాక్ట్ అవుతున్నారు. మరో వైపు కేంద్రం వడ్ల కొనుగోలు విషయంపై చర్చించేందుకు టీఆర్ఎస్ మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసేందుకు వెళ్లింది.
KTR
మరో వైపు వడ్లు కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడంతో అధికార పార్టీకి చెందిన నాయకులు కేంద్రం దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇక కేటీఆర్ విషయానికి వస్తే ఆయన మంత్రుల బృందంతో కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లలేదు. దిష్టిబొమ్మల దహనం కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. దీంతో విపక్షలు అన్ని మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లాడంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టాయి.
మంత్రి కేటీఆర్ ఎక్కడున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదటగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆయన ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే విదేశీ పర్యటనలకు వెళ్లారని, అసలు ఏం పనిమీద వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ సంతోష్ సైతం ఇలాగే విదేశాలకు వెళ్లారని రేవంత్ ఆరోపించారు. ఇదిలా ఉండగా మంత్రి కేటీఆర్ ముందు దుబాయ్, అక్కడి నుంచి జర్మనీ, అనంతరం అమెరికాకు వెళ్లినట్టు టీ కాంగ్రెస్ కు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.
కేటీఆర్ ది కేవలం వ్యక్తిగత పర్యటనేనని అందుకే పర్యటనకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని సమాచారం. అధికారిక పర్యటన కోసం కేటీఆర్ విదేశాలకు వెళితే ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రి కేటీఆర్ పర్యటన విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి నిజంగా ఆయన విదేశాలకే వెళ్లారా? లేక పర్సనల్ పనిపై మరెక్కడికైనా వెళ్లారా అనేది ఆయన నేరుగా స్పందిస్తే గాని తెలియని పరిస్థితి. ఆయన స్పందించే వరకు ఈ వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చేలా లేదు.